అత్యాచార ఆరోపణలపై స్పందించిన యాంకర్ ప్రదీప్

0

తనపై సినీ ప్రముఖులు వారి పీఏలు ప్రజాప్రతినిధులు పోలీసులు జర్నలిస్టులు కలిసి మొత్తం 143మంది అత్యాచారం చేశారని ఓ 24 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు తెలంగాణలో సంచలనమైంది. దీంతో కేసును సీసీఎస్ కు బదిలీ చేయగా వారు వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఈ కేసులో యాంకర్ ప్రదీప్ పేరు కూడా వినిపిస్తోంది. ఆ యువతి ప్రదీప్ ను కూడా నిందితుడిగా పేర్కొంటూ ఆ 143మందిలో ఒకడిగా ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో మీడియాలో ప్రదీప్ ఉన్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఆరోపణలపై స్పందించిన యాంకర్ ప్రదీప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ఆరోపణలు బాధపెడుతున్నాయని.. ఇలాంటి సున్నిత విషయాల్లో తన పేరు ఉపయోగిస్తూ దాడి చేస్తున్నారని వాపోయాడు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని బాధపడ్డాడు.

యూట్యూబ్ వెబ్ సైట్స్ వ్యూస్ కోసం తనను టార్గెట్ చేస్తున్నారని యాంకర్ ప్రదీప్ ఆవేదన వ్యకత్ం చేశాడు. తన కుటుంబాన్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని.. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తానని వెల్లడించాడు.

బాధిత యువతికి న్యాయం జరగాలని.. నిజాలు తెలుసుకోకుండా తనను టార్గెట్ చేయడం భావ్యం కాదని ప్రదీప్ సూచించారు. తన పేరును సోషల్ మీడియాలో వాడుతూ తనను ఎదగనీయకుండా చేస్తున్నారేమోనని ఆవేదన వ్యక్తం చేశాడు.