కసబ్ కంటే దారుణంగా రియాను చూస్తున్నారంటూ మీడియాపై హీరోయిన్ పైర్

0

సుశాంత్ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని ప్రశ్నించేందుకు ఇంటర్వ్యూ తీసుకునేందుకు దాదాపు అన్ని మీడియా సంస్థలు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు ఆమె గురించి మీడియాలో ఇష్టానుసారంగా కథనాలు ప్రసారం చేయడం ఆమె సుశాంత్ మృతికి కారణం అంటూ తేల్చుతూ వ్యాఖ్యలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రియాకు బాసటగా హీరోయిన్ స్వరా భాస్కర్ మద్దతుగా నిలిచింది. ఈమె గతంలో కరణ్ జోహార్ కు కూడా మద్దతు గా నిలిచి విమర్శల పాలయ్యింది.

సోషల్ మీడియాలో జనాలు కరణ్ జో నెపొటిజం పేరుతో టార్గెట్ చేస్తున్న సమయంలో ఆయనకు బాసటగా మాట్లాడుతూ కరణ్ ఒక్కడే మొత్తం నెపొటిజంకు కారణం అంటూ వ్యాఖ్యలు చేయడం సరి కాదంటూ పేర్కొంది. అప్పుడు ఆమెకు కరణ్ నుండి ఏమైనా ఆఫర్ వచ్చిందా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావు అంటూ ట్రోల్స్ చేశారు.

ఇప్పుడు ఆమె రియాకు మద్దతుగా నిలిచింది. ముంబయి మారణ హోమంకు కారణం అయిన కసబ్ ను కూడా మీడియా ఇంతగా టార్గెట్ చేసి ఉండరు. రియాను మరీ దారుణంగా హింసిస్తున్నారు అంటూ ఆమె పేర్కొంది. సిగ్గు లేని ఇండియన్ మీడియా అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీడియాపై స్వరా భాస్కర్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రియా చక్రవర్తికి మద్దతుగా నిలిచిన స్వరా భాస్కర్ ను నెటిజన్స్ టార్గెట్ చేస్తున్నారు.