మరీ రొమాంటిక్గా హాట్ యాంకర్

0

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు విష్ణు ప్రియను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. శ్రీముఖి స్నేహితురాలిగా పేరున్న ఈ అమ్మడు ఆమె వల్లనో లేదా సొంతంగానో కాని వరుసగా బుల్లి తెర షో లపై కనిపిస్తూనే ఉంది. ప్రస్తుతం సుధీర్ తో కలిసి పోరా పోవే అనే షో ను చేస్తుండటంతో పాటు ఇంకా ఇతర షోల్లో కూడా రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటుంది. ఇక ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు మరియు వీడియోలు రచ్చ రచ్చగా ఉంటాయి. కొన్ని సార్లు బాబోయ్ ఇంత మాస్ ఏంటీ అన్నట్లుగా ఉండే ఈ అమ్మడు కొన్ని సార్లు రొమాంటిక్ లుక్ తో రచ్చ రచ్చ చేస్తుంది.

ఇటీవల షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న విష్ణు ప్రియ రెగ్యులర్ గా తన హాట్ ఫొటోలను రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా షేర్ చేసిన ఈ ఫొటో కాస్త ఘాటుగా ఉంది. షర్ట్ బటన్ ఓపెన్ చేసి మరీ కాస్త హాట్ లుక్ ను ఇచ్చిన విష్ణు ప్రియకు భారీగా లైక్స్ వస్తున్నాయి. దాదాపుగా లక్ష మంది ఈ ఫొటోకు లైక్ చేయడంతో పాటు వేలాది మంది సూపర్బ్ హీరోయిన్ గా ఎందుకు మీరు ట్రై చేయకూడదు అంటూ సలహా ఇస్తున్నారు. హీరోయిన్ కు ఏమాత్రం తగ్గకుండా మీరు హాట్ గా ఉన్నారంటూ చాలా మంది ఆమెకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు.