ఇంట్లో డబ్బులు అడగలేక పెట్రోల్ బంక్ లో పనిచేశా

0

కొందరు హీరోలు బార్న్ విత్ గోల్డెన్ స్ఫూన్ అయినా కొందరు మాత్రం కింది స్థాయి నుండి వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినిమా ఇండస్ట్రీలో పరిచయం అయ్యాడు. మొదట ఈయన యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ల కోసం వర్క్ చేశాడు. సహాయ దర్శకుడిగా నటుడిగా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ ల్లో నటించిన రాజ్ తరుణ్ ఆ సమయంలో తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడట. ఒకానొక సమయంలో ఇంట్లో వారిని డబ్బులు పంపించమని అడుగలేక కొన్ని రోజుల పాటు సహాయ దర్శకుడిగా చేస్తూనే పెట్రోల్ బంక్ లో కూడా పని చేశాను అంటూ తాజాగా ఒక టాక్ షో లో రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు.

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ ఆ తర్వాత వరుసగా సక్సెస్ లను అందుకున్నాడు. మద్యలో కాస్త డల్ అయినా మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒరేయ్ బుజ్జిగా సినిమాతో ఇటీవలే ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ ఆ సినిమా ప్రమోషన్ సందర్బంగా టాక్ షో లో తన సినీ కెరీర్ గురించి తెలియజేశాడు. పెట్రోల్ బంకులో పని చేస్తున్న సమయంలో నేను దాన్ని కష్టం అనుకోకుండా జీవితంలో భాగం అనుకున్నాను. 13 రోజులు పడ్డ కష్టం గురించి నేను ఎప్పుడు బాధ పడను అంటూ రాజ్ తరుణ్ తన పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు.

అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని చేస్తాం. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే పెద్దగా పట్టించుకోం. కాని అంధగాడు ఫ్లాప్ అయినప్పుడు మాత్రం నాతో పాటు యూనిట్ సభ్యులందరం కూడా చాలా బాధపడ్డాం. ఆ సినిమా పై ప్రతి ఒక్కరం ఆశలు పెట్టుకోగా నిరాశే మిగిలిందని రాజ్ తరుణ్ అన్నాడు. నా నుండి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో ఆ పాత్రలను చేసేందుకు నేను సిద్దంగా ఉన్నట్లుగా చెప్పింది.