Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆండ్రాయిడ్ కట్టప్ప అంటూ అవమానిస్తారా?

ఆండ్రాయిడ్ కట్టప్ప అంటూ అవమానిస్తారా?


రోబో శంకర్ 2.0 తీశారు. రోబోటిక్ విన్యాసాలతో అదరగొట్టారు. కానీ వీళ్లేంటి.. వెర్షన్ 5.25 అంటూ ఏదో వెరైటీ టైటిల్ పెట్టారు? ఏమో కానీ ఈ టైటిల్ తోనే అంతో ఇంతో ఆకర్షించారు. మలయాళంలో హిట్టు కొట్టారు. అక్కడ హిట్టు కొట్టిన `ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25` తెలుగులోనూ రిలీజవుతోందట.

టాలీవుడ్ వెర్షన్ కి `ఆండ్రాయిడ్ కట్టప్ప` అనే టైటిల్ ని ఫిక్స్ చేసి త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు వెర్షన్ డబ్బింగ్ పూర్తవుతోంది. థియేటర్లు తెరిచిన వెంటనే ఈ చిత్రం విడుదల చేస్తారట.

2019 సంవత్సరంలో విడుదలైన మాలీవుడ్ చిత్రం `ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25` భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు టాలీవుడ్ వెర్షన్ త్వరలో పెద్ద స్క్రీన్లలో విడుదల చేసే ప్రయత్నం బాగానే ఉన్నా అసలు ఎవరు చూస్తారు? అన్నదే ఆలోచించాల్సిన పాయింట్. ఒక డబ్బింగ్ సినిమా కోసం ఏకంగా కట్టప్ప పేరునే వాడేస్తున్నారు. ఇది రాజమౌళి బృందానికి రుచిస్తుందా? అన్నది చూడాలి.

ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు- సౌబిన్ షాహిర్- కెండి జిర్డో- సైజు కురుప్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు.సూరజ్ తాలెకాడ్ కుంజప్పన్ అనే రోబోట్ పాత్రను పోషించగా.. సూరజ్ ఒక వృద్ధుడిగా కనిపించాడు. ఈ చిత్ర కథాంశం ఒక ఏజ్డ్ ఒంటరివ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను తన కొడుకు నుండి బహుమతిగా రోబోట్ ని అందుకుంటాడు. కొడుకు పాత్రలో సౌబిన్ కనిపించాడు. రతీష్ బాలకృష్ణన్ పోడువాల్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా ఆంగ్ల చిత్రం రోబోట్ .. ఫ్రాంక్ స్ఫూర్తితో తెరకెక్కించారని సమాచారం. ఈ చిత్రానికి బీ.జీబాల్ సంగీతం సమకూర్చారు. మలయాళంలో అన్ని పాటలు విజయవంతమయ్యాయి.