DRUGS దీపిక విచారణ రణ్ వీర్ ని అంతగా కలచివేసిందా?

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం కేసు ట్విస్టుల గురించి తెలిసిందే. బాలీవుడ్ డ్రగ్స్ తో ముడిపడిన టాపిక్ కావడంతో ఎన్.సి.బి బరిలో దిగి విచారిస్తోంది. ఈ విచారణలో పలువురు స్టార్ హీరోయిన్లకు నార్కోటిక్స్ వాళ్లు ప్రశ్నల వర్షంతో చుక్కలు చూపించారని జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే కి చిక్కులు తప్పలేదు. ఒకానొక సందర్భంలో ఎన్.సి.బి ప్రశ్నల దాడికి గురైన దీపిక వెక్కి వెక్కి ఏడ్చిందని మూడు సార్లయినా ఏడ్చి ఉంటుందని నేషనల్ మీడియా అదే పనిగా స్క్రోలింగులు వేయడం సంచలనమైంది.

అయితే ఈ వార్తలన్నీ విన్న దీపిక హబ్బీ రణవీర్ సింగ్ కలతకు గురయ్యారా? అందుకే ఆయన గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో అంత స్పీడ్ గా లేరా? అంటూ హిందీ మీడియా గుసాయించేస్తోంది. చాలా కాలం తర్వాత దీపిక విచారణ ముగిసిన తర్వాత.. ఇన్నాళ్టికి రణ్వీర్ సింగ్ మొదటిసారి ట్వీట్ చేశాడు.

రాబోయే పండుగ సీజన్ కంటే ముందే కోవిడ్ -19 తిరోగమనంలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత … ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పెట్టాలన్న ప్రధాని ప్రయత్నానికి రణవీర్ సింగ్ ట్విట్టర్లో మద్దతునిచ్చారు. PM ట్వీట్కు సమాధానమిస్తూ ..“లెట్స్ # యునైట్ 2 ఫైట్ కోరోనా! …” అని సింపుల్ గా ఒక వ్యాఖ్యను రాశారు. కోవిడ్ -19 నివారణ గురించి ఒక ముఖ్యమైన పోస్ట్ తో రణ్వీర్ సింగ్ నాలుగు నెలల తర్వాత ట్విట్టర్ లోకి తిరిగి వచ్చారు.

రణ్ వీర్ సింగ్ చివరిసారిగా ముంబై విమానాశ్రయంలో భార్య దీపికా పదుకొనేతో కలిసి గోవా నుంచి తిరిగి వచ్చారు. బాలీవుడ్ డ్రగ్ కార్టెల్ కేసులో దీపికాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పిలిపించి దాదాపు ఐదు గంటలు విచారించిన తరువాత స్వచ్ఛందంగా తన ఫోన్ ను అధికారులకు సమర్పించిన తరువాత.. దీపిక కార్యాలయం నుండి వెళ్లిపోయింది. ఆ ఎపిసోడ్ తర్వాత రణ్ వీర్ ఈ రోజు మొదటిసారి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కోవిడ్ కి సంబంధించి ప్రధాని పిలుపునకు మద్ధతునిచ్చారు. ఇక అంతకుముందు అతని చివరి ట్వీట్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ కోసం ఒక RIP ట్వీట్.

ఇక రణవీర్ కెరీర్ సంగతి చూస్తే… కబీర్ ఖాన్ తో 83 మూవీ చేస్తున్నాడు. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొనేతో స్క్రీన్ ని పంచుకుంటున్నారు. ఈ చిత్రం 2020 వేసవిలో విడుదల కావాల్సి ఉన్నా.. మహమ్మారి కారణంగా విడుదల ఆలస్యం అయింది. అంతేకాకుండా జయేష్ భాయ్ జోర్దార్` లో కూడా రణ్వీర్ కనిపించనున్నారు. దీపిక విషయానికొస్తే… అనన్య పాండే – సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన తాజా చిత్రం కోసం గోవాలో షూటింగ్ లో ఉంది. షకున్ బాత్రా తెరకెక్కిస్తున్నారు. ఎన్.సిబి సమన్ తర్వాత ఆమె షూటింగ్ నుండి నిష్క్రమించింది. అయితే త్వరలో ఆమె గోవాలో షూటింగ్ ను తిరిగి ప్రారంభిస్తుందా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.