మే 27న విడుదలైన F3 మూవీ సినిమాపై కొందరు నెగెటివ్‌గా రివ్యూస్ ఇవ్వడంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రియాక్ట్ అయ్యారు. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెగెటివ్ రివ్యూలపై సెటైర్స్ వేశారు. F3 సినిమాకు సంబంధించి విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ల నటనను అందరూ ప్రశంసించారు కానీ ఇది రొటీన్ కామెడీ అని, గతంలో వచ్చిన సినిమాల్లో లాగానే కామెడీ రిపీట్ అయిందనే టాక్ స్ప్రెడ్ చేశారు. ఈ మేరకు అదే లైనప్‌తో కొంతమంది రివ్యూస్ కూడా రాసేశారు. ఇవి చూసిన అనిల్.. తనదైన స్టైల్ రియాక్షన్ ఇస్తూ నెగెటివ్ రివ్యూలను తిప్పికొట్టడం గమనార్హం. ఈ మేరకు సమీక్షకులపై అనిల్ వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి.
శుక్రవారం వస్తే టాక్ ఎలా వస్తుందా? ఎంత నెగెటివిటీ వస్తుందా అని భయపడుతున్నాం.. అంత నెగెటివిటీలో బతుకుతున్నాం మనం. నవ్వుకునే సినిమా ఒకటొచ్చింది. ప్రశాంతంగా వెళ్లి నవ్వుకుందాం. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం.. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్.. సంవత్సరానికి నవ్వుకునే సినిమా ఒకటి లేదా రెండే వస్తాయి. ఇక వాటిలో కూడా లెక్కలేస్తే మనం ఏం చేస్తాం.. జస్ట్.. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకు వెళ్లండి వెళ్లండి. మీ స్ట్రెస్ అంతా పోతుంది.. హ్యాపీగా ఎంజాయ్ చేయకపోతే నన్ను అడగండి.. ఇది నాది ప్రామీస్ అంటూ విడుదల తర్వాత కూడా తన F3 సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు అనిల్ రావిపూడి.
మొదటినుంచే తన సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్న అనిల్ రావిపూడి.. విడుదల తర్వాత కూడా అదే రేంజ్‌లో ప్రమోట్ చేసుకుంటూ ఉండటం ఆయనలోని కాన్ఫిడెన్స్‌కి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. పూర్తిగా జంధ్యాల, ఇవివి ట్రాక్‌లో తెరకెక్కించిన ఈ మూవీ చూస్తుంటే.. పాత కామెడీ సినిమాలు గుర్తుకు వస్తాయి.
ఈ సినిమాలో రే చీకటితో బాధపడే వ్యక్తిగా వెంకటేష్, నత్తితో బాధపడే వ్యక్తిగా వరుణ్ తేజ్ నటించి కడుపుబ్బా నవ్వించారు. వెంకటేష్‌కు జోడీగా తమన్నా నటించగా.. వరుణ్ తేజ్‌కు జోడీగా మెహ్రీన్ ఆడిపాడింది. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోను అదరగొడుతోంది. ఫస్ట్ వీకెండ్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది.
Note : Your feedback is important to us. please let us know whether you LIKE the content or not. request not to post any abuse comments or feedback.