బాలయ్య సరసన తెలుగు భామ…?

0

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాని బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ చేస్తున్నారు. కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మొదట్లో బాలయ్యకు జోడీగా కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకున్న బోయపాటి శ్రీను ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకున్నాడట. చివరకి ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన అచ్చ తెలుగు భామ అంజలిని హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అంజలి.. బాలయ్య హీరోగా నటించిన ‘డిక్టేటర్’ మూవీలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఒక మోస్తరు ఫలితాన్నే అందుకుంది. బిబి3 హీరోయిన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. ఇప్పుడు మళ్ళీ బాలయ్య వరుస ప్లాపుల్లో ఉన్నాడు. మళ్ళీ బోయపాటి సినిమాతో బాలయ్య బౌన్స్ బ్యాక్ అవుతాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే బీబీ3 టీజర్ అదరగొట్టింది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. అందులో ఒకటి అఘోర పాత్ర కాగా.. రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం. మరి ఈ చిత్రంతో బాలయ్య – బోయపాటి శ్రీను హాట్రిక్ హిట్ సాధిస్తారా లేదా అనేది చూడాలి.