Templates by BIGtheme NET
Home >> Cinema News >> నేను మ‌న‌సిస్తే..అత‌డు షాకిచ్చాడు!

నేను మ‌న‌సిస్తే..అత‌డు షాకిచ్చాడు!


బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణించి మూడేళ్లు అవుతున్నా! అత‌ని పై క‌థ‌నాలు మాత్రం వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. రియా చ‌క్ర‌వ‌ర్తి మీడియా ముందుకొచ్చిన ప్ర‌తీసారి సుషాంత్ సింగ్ తో రిలేష‌న్ షిప్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఈనేప‌థ్యంలో తాజాగా సుషాంత్ సింగ్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండే అత‌డితో బ్రేక‌ప్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

సుషాంత్ సింగ్ ని తానెంతో ప్రేమించాన‌ని.. ఎదుట వారి మాట‌లు విని అత‌ను త‌న నుంచి దూర‌మైన‌ట్లు చెప్పుకొచ్చారు. ఇద్ద‌రం విడిపోవ‌డానికి పెద్ద కార‌ణాలంటూ ఏమీ లేవు. అత‌డు విడిపోదాం అన్న‌ప్పుడు ఒక్క‌సారిగా షాక్ అయ్యాను. సుషాంత్ అలా ఎందుకు అంటున్నాడో? అర్దం కాలేదు. అత‌డి నిర్ణయంతో రాత్రికి రాత్రే నా జీవితం లో ప‌రిస్థితులు మారిపోయాయి. అత‌డు విడిపోవాల‌ని ఎందుకు నిర్ణ‌యం తీసుకున్నాడో? ఇప్పటికీ నాకు తెలియ‌దు.

ఎంత ఆలోచించినా అర్దం కూడా కాలేదు. అలాగ‌ని అత‌న్ని త‌ప్పు బ‌ట్ట‌లేదు. ఆయ‌న మ‌న‌సుకు తోచిన నిర్ణ‌యం నిర్మొహ‌మాటంగా చెప్ప‌డంతోనే నా మ‌న‌సు ముక్క‌లైన‌ట్లు అనిపించింది. ఆ త‌ర్వాత వేరొక‌రితో రిలేష‌న్ షిప్ లోకి వెళ్లాలంటే భ‌య‌మేసింది’ అని అన్నారు. మ‌రి వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఎలా పుట్టిందో తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంజ‌నీరింగ్ పూర్తయిన త‌ర్వాత సినిమాల్లో కి వ‌చ్చే ప్ర‌క్రియ‌లో భాగంగా తొలుత టీవీ సిరియ‌ల్స్ లో న‌టించాడు.

అలా ఓ సీరియ‌ల్ కోసం అంకిత‌- సుషాంత్ క‌లిసి ప‌నిచేసారు. అదే స‌మ‌యంలో ప‌రిచ‌యం స్నేహంగా.. ప్రేమ‌గా మారింది. అయితే సుషాంత్ హీరోగా ట‌ర్న్ తీసుకున్న త‌ర్వాత ప‌రిస్థితులు మారాయి. ఇద్ద‌రు విడిపోయారు. రియా చ‌క్ర‌వ‌ర్తితో కొత్త ప్రేమాయ‌ణం మొద‌లు పెట్టాడు. ఆమెని పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నాడు. కానీ ఆత్మ‌హ‌త్య నిర్ణ‌యంతో అత‌డి జీవిత‌మే ముగిసిపోయింది.