Templates by BIGtheme NET
Home >> Cinema News >> అల్తా స్టైలిష్ లో మనోజ్ జోడి

అల్తా స్టైలిష్ లో మనోజ్ జోడి


ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ – భూమా మౌనిక జోడి ఏదైనా వేడుకల్లో పాల్గొంటే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన జియో ప్లాజా కార్యక్రమంలో కూడా ఈ జంట అందరిని ఎంతగానో ఆకర్షిచింది. మనోజ్ జిప్పర్ అలంకారాలతో బ్లాక్ టక్సేడోలో డాషింగ్‌గా కనిపించాడు. అలాగే నిగనిగలాడే పేటెంట్ లెదర్ షూస్‌తో లుక్‌ను హైలెట్ చేశాడు.

మౌనిక భూమా మంచు షీర్ & శాటిన్ కార్సెట్‌తో బ్లాక్ శాటిన్ ప్యాంట్-సూట్‌లో మురిసిపోయింది. అలాగే ఆమె మిరుమిట్లు గొలిపే డైమండ్ డాంగ్లర్‌లతో బ్లింగ్‌ను జోడించింది. జియో దిగ్గజం ముకేశ్ అంబానీతోనిని కలిసిన ఈ జంట ఆయనతో మాట్లాడిన అనంతరం బ్యూటిఫుల్ స్టిల్స్ తో ఫొటోలకు పోజులు ఇచ్చారు.

ఈ వేడుకలో చాలామంది బాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక మంచు మనోజ్ జోడి కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చాలాకాలం నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినటువంటి మనోజ్ మౌనిక పాలిటిక్స్ లలో కూడా అనుభవం కలిగిన వారే. ఇక పెళ్లి చేసుకున్న అనంతరం వీరు ఇప్పుడు పాలిటిక్స్ లోకి కలిసి అడుగు వేసే అవకాశం ఉన్నట్లు చాలా రకాల గాసిప్స్ వచ్చాయి.

ముఖ్యంగా మనోజ్ తండ్రి వారసత్వ రాజకీయాన్ని కొనసాగిస్తాడాని కూడా చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ విషయంలో కూడా ఇప్పటివరకు సరైన క్లారిటీ ఎవరు ఇవ్వలేదు. ఇక మనోజ్ సినిమాలకు ఎండ్ కార్డు వేసినట్లే అనుకుంటున్న తరుణంలో మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి షాక్ ఇచ్చాడు. అలాగే ఒక గేమ్ షోకు హోస్ట్ గా కూడా చేయబోతున్న మనోజ్ ఓటీటీ ప్రపంచంలో కూడా బిజీ కానున్నాడు.

అప్పట్లో మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే ప్రాజెక్టు ఎనౌన్స్ చేశాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఆ సినిమా రాబోతోందని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టు సడన్ గా మళ్ళీ ఆగిపోయింది. అయితే ఆ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనే విషయం గురించి దర్శకుడిని అడిగితే మనోజ్ చేతుల్లోనే ఉందని అన్నాడు. మరి మనోజ్ ఆ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో చూడాలి.