Templates by BIGtheme NET
Home >> Cinema News >> సుకుమార్ తో సినిమా.. హీరోనే వెనక్కి తగ్గుతున్నాడా..?

సుకుమార్ తో సినిమా.. హీరోనే వెనక్కి తగ్గుతున్నాడా..?


పుష్ప 2 తర్వాత సుకుమార్ ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్నది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పుష్ప 2 ని 2024 ఆగష్టు రిలీజ్ ప్లాన్ చేసిన సుకుమార్ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారట. సుకుమార్ అల్లు అర్జున్ ఈ ఇద్దరు మరోసారి బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటాలని చూస్తున్నారు. సుకుమార్ పుష్ప 2 తర్వాత నెక్స్ట్ సినిమా ఏంటన్న దానిపై క్లారిటీ రాలేదు. అసలైతే విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా ఒకటి అనౌన్స్ మెంట్ వచ్చింది.

లైగర్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో పూరీ కూడా సుకుమార్ కి నువ్వు విజయ్ తో చేస్తావ్ కదా అప్పుడు తెలుస్తుంది అతని టాలెంట్ అని అన్నాడు. సుకుమార్ విజయ్ దేవరకొండ ఈ కాంబో నిజంగానే సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్ ఈ ఇద్దరు కలిసి సినిమా చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. కానీ ఈ సినిమా విషయంలో విజయ్ మాత్రం ఆసక్తిగా లేరని టాక్.

సుకుమార్ విజయ్ దేవరకొండ సినిమా ప్రకటన వచ్చినా ఆ తర్వాత సినిమాకు సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విజయ్ మాత్రం సుకుమార్ సినిమా కాకుండా వరుస ప్రాజెక్ట్ లు చేస్తూ వస్తున్నాడు. ఆల్రెడీ పరశురాం తో ఫ్యామిలీ స్టార్ చేస్తున్న విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నాడు. అయితే విజయ్ సుకుమార్ సినిమా ఉంటుంది కానీ మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే అని తెలుస్తుంది. పుష్ప 2 కూడా సుకుమార్ ఆశించిన ఫలితాన్ని అందుకుంటే సుక్కు చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా వైడ్ పెద్ద మార్కెట్ చేస్తుంది. అందుకే సుకుమార్ నెక్స్ట్ హీరో ఎవరైనా సరే ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది.

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబో సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తుండగా ఆ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందేమో చూడాలి. రౌడీ ఫ్యాన్స్ మాత్రం సుక్కుతో సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. విజయ్ ఫ్యామిలీ స్టార్ సంక్రాంతికి వస్తుండగా 2024 చివర్లో గౌతం తిన్ననూరి సినిమా రిలీజ్ ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకే విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా అప్డేట్ వస్తుందని తెలుస్తుంది.