2016 వరకూ సుశాంత్ బాగానే ఉన్నాడన్న మాజీ ప్రేయసి

0

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉత్థానపతనాల్ని స్వయంగా దగ్గరుండి చూసిన భామగా అతడి మాజీ ప్రేయసి అంకిత లోఖండే చేసిన తాజా వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అంకిత ఏమంది? అంటే.. 2016 వరకూ అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే సుశాంత్ జీవితంలో కల్లోలం మొదలైందని అంకిత వ్యాఖ్యానించారు. సుశాంత్ గత కొన్నేళ్లుగా నిరాశలో ఉన్నాడు .. డిప్రెషన్ ని పోగొట్టుకోవడానికి మెడిసిన్ తీసుకుంటున్నాడని చెబుతున్న రియా వెర్షన్ కి పూర్తి ఆపోజిట్ వెర్షన్ అంకిత వినిపించింది.

ఇప్పటికే రియాకు వ్యతిరేకంగా సుశాంత్ అభిమానులు తీవ్ర వ్యాఖ్యాలు చేస్తుంటే వాటిని ఖండించేందుకు మీడియా ముందుకు వస్తోంది. ఇప్పుడు అంకిత వ్యాఖ్యలు రియాను ఇరికించేవిగా ఉన్నాయి. విమానం ఎక్కేందుకు సుశాంత్ భయపడేవాడు అని రియా చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ అంకిత స్వయంగా విమానం కాక్ పిట్ లో ఉన్న సుశాంత్ వీడియోలను పంచుకుంది.తరువాత ఒక పెద్ద నోట్ను పోస్ట్ చేసింది. దీనిలో రియా వ్యాఖ్యలకు కౌంటర్ వేస్తూ ఆమె స్పష్టతనిచ్చింది. “ఫిబ్రవరి 2016 వరకు సుశాంత్కు ఎప్పుడూ నిరాశను కలిగించే పరిస్థితులు లేవు. అతడు మానసిక వైద్యుడిని సందర్శించలేదు. అతను పూర్తిగా బాగానే ఉన్నాడు ”అని అంకిత అన్నారు.

సుశాంత్ నేను విడిపోయిన తరువాత మేము ఎప్పుడూ సన్నిహితంగా లేము. రియా చక్రవర్తి కి సుశాంత్తో ఉన్న సంబంధం గురించి నాకు తెలియదు. నేను ఇందులో సుశాంత్ కుటుంబానికి అండగా నిలుస్తాను. సుశాంత్ కి రియా వల్లనే సమస్యలు తలెత్తాయి అని అంకిత వ్యాఖ్యానించింది. అంకిత తాజా వ్యాఖ్యలు వింటుంటే రియా చెబుతున్న దాని కంటే నిజాయితీగా ఉన్నాయని అభిమానులు అంటున్నారు. అయితే 2016 వరకూ బాగానే ఉన్నాడు అని అంటే.. ఆ తర్వాత రియా చక్రవర్తి తన లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చాకనే అతడికి బాలేదన్న అర్థం వచ్చినట్టేగా..

Few Revelations on today.. Follows #ITWILLCONTINUETILLWEGETJUSTICE

null