Templates by BIGtheme NET
Home >> Cinema News >> పవర్ స్టార్ అభిమానులకు మరో చేదువార్త..!!

పవర్ స్టార్ అభిమానులకు మరో చేదువార్త..!!


టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ గా మళ్లీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. రోజురోజుకి భారీ అంచనాలు పెరుగుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ నివేత థామస్ ప్రముఖ పాత్ర పోషిస్తుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్నీ పనులు పూర్తి అవుతుండగా.. పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ నటించనున్నట్లు తెలుస్తుంది. గబ్బర్ సింగ్ కాటంరాయుడు సినిమాల తర్వాత శృతి – పవన్ కళ్యాణ్ తో ఇదే హ్యాట్రిక్ మూవీ అని అభిమానులు అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ నటించబోయే తదుపరి సినిమాలలో ఇక పై డాన్సులు చేయరట.. డాన్స్ చేసే పాటలు కూడా ఉండవని ఇదివరకే ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన రాజకీయ సేవా కార్యక్రమాలలో ఉంటూ ఇలాంటి పాటలు డాన్సులు.. రొమాన్స్ కరెక్ట్ కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వచ్చే నెల అంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆ రోజు కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎంతో స్పెషల్ డే. నిజానికి ఆ రోజున వకీల్ సాబ్ రిలీజ్ డేట్ ప్రకటిస్తాడని వెయిట్ చేస్తున్నారు. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఆ రోజు వకీల్ సాబ్ టీజర్ కొత్త పోస్టర్ విడుదల చేస్తారని ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వకీల్ సాబ్ నుండి ఎలాంటి టీజర్ రావట్లేదని టాక్. ఇప్పటికే ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అభిమాన హీరో ఎంట్రీ టైంలో కరోనా అడ్డుపడింది. ఇప్పుడేమో టీజర్ రాదని నిరాశ. చూడాలి మరి ప్రొడ్యూసర్ దిల్ రాజు సర్ప్రైజ్ ఏమైనా ఇస్తాడేమో..!!