ఆహా.. సెల్ఫీతో కనువిందు చేస్తున్న శృంగారతార..!!

0

శృంగారతార సన్నీలియోన్.. అంటే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ కలిగి ఉంది. ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అడల్ట్ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సన్నీకి కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు. 2011లో హిందీ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్-5’లో కంటెస్టెంటుగా పాల్గొని.. 2012లో పూజ భట్ దర్శకత్వం వహించిన ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీతారగా అరంగేట్రం చేసింది సన్నీ. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులకు సన్నీ ఒక ఆరాధ్య దేవత. ప్రస్తుతం సన్నీ పెళ్లి చేసుకొని పిల్లాపాపలతో భర్తతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. లాక్ డౌన్ సమయం ఇండియాలోనే గడిపిన ఈ బ్యూటీ ఇటీవలే కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయింది. అక్కడ అమ్మడికి తెగ ఫ్రీడమ్ లభిస్తోందట. ఎందుకంటే ముంబైలో మాస్క్ పెట్టుకొని సామాజిక దూరం పాటించిన సన్నీ.. అక్కడ కూడా సామాజిక దూరం పాటిస్తూ భర్తతో.. స్నేహితులతో బీచ్ లలో ఎంజాయ్ చేస్తోంది.

ఇక సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సన్నీ.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ మురిపిస్తోంది. అయితే తాజాగా స్నేహితురాలితో స్విమ్మింగ్ చేసిన సన్నీ. తనకు నచ్చినట్లు తను జీవిస్తోంది. ఇక సన్నీ అప్డేట్స్ కోసం కుర్రకారు ఆత్రంగా ఎదురు చూస్తారు. తాజాగా స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీ ధరించిన ఈ భామ పిక్ తెగ వైరల్ అవుతోంది. స్విమ్ సూట్ ధరించిన స్నేహితురాలితో కలిసి సన్నీ గులాబీ రంగు బికినీలో దిగిన సెల్ఫీ ఫోటోలు షేర్ చేసింది. నిజంగా ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది సన్నీ తన లైఫ్ ఎంత హ్యాపీగా లీడ్ చేస్తుందో.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పింక్ స్విమ్ సూట్లో అమ్మడు కాస్త జోలీగా కనిపించి అభిమానులను మాత్రం వేడెక్కిస్తుందని చెప్పాలి. ఎలాగైతే ఏంటి అభిమాన తార మాకు అందాల వడ్డన చేయడమే చాలంటూ సన్నీ అందాలను లొట్టలేసుకుంటూ చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం సన్నీ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.