దగ్గుబాటి ఫ్యామిలీలో మరో స్మార్ట్ హీరో?

0

టాలీవుడ్ లో స్టార్ హీరోల కుటుంబాల నుంచి నటవారసుల వెల్లువ చూస్తున్నదే. నంబర్ ఎంతో లెక్కించడం అభిమానులకు అలవాటు వ్యాపకంగా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి డజను.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు.. మంచు ఫ్యామిలీ నుంచి నలుగురు.. నందమూరి కుటుంబం నుంచి ఆ నలుగురు!! అంటూ లెక్కలు వేస్తున్నారు.

ఇక దగ్గుబాటి కుటుంబం నుంచి విక్టరీ వెంకటేష్ తర్వాత రానా మాత్రమే హీరో అయ్యాడు. రానా సోదరుడు అభిరామ్ హీరో కావాల్సి ఉందింకా. ఈలోగానే ఇంకో హీరో ఈ కుటుంబం నుంచి రెడీ అవుతున్నాడన్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఇంతకీ ఎవరా హీరో అంటే.. రానా దగ్గుబాటి బావమరిది సమర్థ్ బజాజ్. ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్ సోదరి సాషాను పెళ్లాడిన సమర్థ్ బిజినెస్ మేన్. ఇటీవల రానా-మిహీక జంట నిశ్చితార్థ వేడుకలో అతడు సందడి చేశాడు.

ఆ వేడుకలో సమర్థ్ తన సోదరి మిహీక బజాజ్ తో కలిసి ఉన్న ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఆ అరుదైన ఫోటోని రానా స్వయంగా సోషల్ మీడియాల్లో షేర్ చేయడంతో ఎవరీ సుందరాంగుడు? అన్న ముచ్చటా సాగింది. హీరో లుక్ తో కుర్రాడు పరేషాన్ చేస్తున్నాడు. దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో పుట్టుకొచ్చినట్టేనా? అంటూ ఫ్యాన్స్ లో చర్చ సాగింది. అతడి ముఖ కవళికలు ఫిజిక్ చూస్తుంటే హీరోనే అంటూ పొగిడేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర కుటుంబం అండా దండా ఉంది.. ఈ రంగంలోకి రావాలని అనుకుంటే ఈ కుర్రాడికి హీరో అయ్యే వరం దక్కినట్టే. అలా కాకుండా బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి తన ఆలోచన ఎలా ఉంది? అన్నది తెలియాల్సి ఉంది.