Templates by BIGtheme NET
Home >> Cinema News >> శ్రీలీలకు ఇది మరో పెద్ద పరిక్షే..

శ్రీలీలకు ఇది మరో పెద్ద పరిక్షే..


పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ శ్రీలీల. ఆ మూవీ డిజాస్టర్ అయిన తర్వాత రవితేజతో ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత ఒక్కసారిగా శ్రీలీలకి ఆఫర్స్ క్యూ కట్టాయి. మీడియం రేంజ్ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరి సినిమాలకి శ్రీలీల ఒకే చెప్పేసింది. ఇవి సెట్స్ పైకి వెళ్ళిపోయాయి.

అందులో మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉన్నాయి. రామ్ పోతినేనికి జోడీగా స్కంద సినిమాలో ఈ బ్యూటీ నటించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. హీరోయిన్ గా ఆ సినిమాలో పెద్దగా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే పాత్రని శ్రీలీల చేయలేదు. రీసెంట్ గా భగవంత్ కేసరి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తనఖాతాలో శ్రీలీల వేసుకుంది.

అయితే ఈ మూవీలో ఆమె హీరోయిన్ కాదు. కమర్షియల్ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ అందుకోవాలంటే కెరియర్ ఆరంభంలో హీరోయిన్ గా చేసే సినిమాలతో సక్సెస్ అందుకోవాలి. కాని హీరోయిన్ గా తెలుగులో ఆమె చేసిన మూడింటిలో రెండు డిజాస్టర్స్. ఇప్పుడు ఆదికేశవ మూవీ డిసెంబర్ 24న థియేటర్స్ లోకి రాబోతోంది. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీతో అయిన కమర్షియల్ హీరోయిన్ గా శ్రీలీల సక్సెస్ అందుకుంటుందా అనేది వేచి చూడాలి.

ఒక వేళ ఇది ఫెయిల్ అయితే ఆమె కెరియర్ కి ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సినిమా ప్రమోషన్స్ అయితే గట్టిగానే చేస్తున్నారు. చిత్ర యూనిట్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉంది. దీని తర్వాత డిసెంబర్ లో నితిన్ కి జోడీగా చేసిన ఎక్స్ట్రార్డినరీ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది. ఆ తరువాత వచ్చే ఏడాది జనవరిలో గుంటూరు కారం మూవీ రిలీజ్ కానుంది.

ఈ మూడు సినిమాల సక్సెస్ శ్రీలీల కెరియర్ ని కచ్చితంగా డిసైడ్ చేస్తాయని చెప్పచ్చు. అందులో ఆదికేశవతో ఆమె కెరియర్ ట్రాక్ కి జరుగుతోన్న మొదటి పరీక్షలో ఎంత వరకు సక్సెస్ అందుకొని ముందుకి వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆదికేశవ హిట్ అయితే వచ్చే ఏడాది మరో రెండు, మూడు సినిమాలు శ్రీలీల ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంటుంది.