సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఏకంగా దశాబ్దం పాటు తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ కాజల్ అగర్వాల్. లక్ష్మి కల్యాణంతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ మగధీరతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తరువాత నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ ల మీద సక్సెస్ లు ఖాతాలో వేసుకుంది.
అయితే రెండేళ్ళ క్రితం తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని కాజల్ అగర్వాల్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఒక బాబు కూడా ఉన్నాడు. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా కొడుకుతో ఆడుకుంటూ ఉన్న వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. పెళ్లి తర్వాత రెండేళ్ళ గ్యాప్ తీసుకున్న ఇప్పుడు మళ్ళీ నటిగా బిజీ అయ్యే ప్రయత్నం కాజల్ అగర్వాల్ చేస్తోంది. ఆచార్య మూవీలో హీరోయిన్ గా ఆమెని ఎంపిక చేసి కొన్ని సన్నివేశాలు షూట్ చేసి తరువాత తొలగించారు.
తాజాగా బాలయ్య భగవంత్ కేసరి మూవీలో కూడా కేవలం కొన్ని సన్నివేశాలకి పరిమితం అయిన క్యారెక్టర్ చేసింది. హీరోయిన్ పాత్రనే అయిన కథకి ఏ మాత్రం ఉపయోగం లేని రోల్ అది. దాంతో కాజల్ కెరియర్ కి పెద్దగా ఒరిగేది అయితే ఏమీ లేదు. తమిళంలో మాత్రం ఫిమేల్ సెంట్రిక్ కథతో మూవీ చేసి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు తెలుగులో ఆమె పోలీస్ ఆఫీసర్ గా సత్యభామ అనే మూవీ వస్తోంది.
ఈ మూవీ హిట్ అయితే మాత్రం ఫిమేల్ సెంట్రిక్ కథలకి కాజల్ అగర్వాల్ మంచి ఛాయస్ గా మారే అవకాశం ఉంది. అలాగే కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీలో కూడా కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ హిట్ అయ్యి తన పాత్రకి గుర్తింపు వస్తే మాత్రం మళ్ళీ నటిగా కెరియర్ కి బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్ అవుట్ డేటెడ్ అయిన త్రిషకి పొన్నియన్ సెల్వన్ సిరీస్ తిరిగి బ్రేక్ ఇచ్చింది.
దీంతో ఇప్పుడు వరుస అవకాశాలని ఈ సీనియర్ బ్యూటీ సొంతం చేసుకుంటుంది. అలాగే రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తోంది. త్రిష తరహాలోనే తనకి భారతీయుడు 2 మూవీ మంచి బ్రేక్ ఇస్తుందని కాజల్ అగర్వాల్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. అది ఎంత వరకు సాధ్యం అవుతుందనేది వేచి చూడాలి.