Templates by BIGtheme NET
Home >> Cinema News >> శ్రావణి కేసులో మరో ట్విస్ట్… సాయి సరికొత్త వాదన

శ్రావణి కేసులో మరో ట్విస్ట్… సాయి సరికొత్త వాదన


బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతోంది. ఈ కేసులో తొలుత దేవరాజ్ ను అనుమానించిన పోలీసులు… అతడిని విచారించిన తర్వాత ఇప్పుడు సాయికృష్ణారెడ్డిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ బయలుదేరిన సాయి… శ్రావణి కేసుకు సంబంధించి చాలా కొత్త విషయాలను వెల్లడించాడు. శ్రావణి కేసుతో తనకు ఎంతమాత్రం సంబంధం లేదని అసలు ఈ కేసులో తాను లేనని వాదిస్తున్న సాయి… పంజాగుట్ట వద్ద దేవ్ రాజ్ ను తాను కొట్టినట్లు ప్రూఫ్ చేస్తే ఎన్ కౌంటర్ కైనా సిద్ధమేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సాయి… పోలీసుల ఎదుట విచారణకు హాజరువుతున్నానని.. తన దగ్గరున్న ఆధారాలను వారికిస్తానని చెప్పాడు. శ్రావణి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న సాయి.. దేవ్ రాజ్ ను ప్లే బాయ్ గా అభివర్ణించేశాడు.

ఈ సందర్భంగా సాయి ఏమన్నాడన్న విషయానికి వస్తే… ‘‘నాపై చేస్తున్న ఆరోపణలు ఏవీ నిజం కాదు. దేవ్ రాజ్ సేఫ్ కావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అతనివల్లే శ్రావణి టార్చర్ అనుభవించింది. దేవ్ రాజ్ ను శ్రావణి ప్రేమిస్తే…అతడిపై ఆమె ఎందుకు కేసు పెట్టింది. పంజాగుట్ట కేసు సమయంలో దేవ్ రాజ్ కు వాటార్ బాటిల్ ఇచ్చా. అయినా అతడికి నాపై విశ్వాసం లేదు. హోటల్ దగ్గర కేవలం ఓపెన్ గా చెప్పు..అని మాత్రమే శ్రావణిని అడిగా. కుటుంబసభ్యులను ట్రాప్ పెట్టే అంత..సీన్ లేదు. అదే ఉంటే..శ్రావణిని ఎందుకు ట్రాప్ పెట్టలేదు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు..ట్రాపింగ్ చేయడం వల్లే..ఆమె చనిపోయింది’’ అని సాయి సంచలన వ్యాఖ్యలే చేశాడు.

ఇదిలా ఉంటే… శ్రావణి సూసైడ్ కేసులో పోలీసులు కీలక విచారణ చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బయల్దేరిన సాయితో పాటు శ్రావణి కుటుంబసభ్యులను ఎస్సార్నగర్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ను ఇప్పటికే పోలీసులు విచారించి కీలక ఆధారాలు సేకరించిన విషయం తెలిసిందే. తొలుత దేవరాజ్ను నిందితుడిగా అనుమానించిన పోలీసులు అతన్ని విచారించారు. దేవరాజ్ అందించిన ఆధారాలతో ఇప్పుడు.. కేసు మొత్తం సాయి మెడకు చుట్టుకుంటోంది. సాయి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. శ్రావణి సూసైడ్ మిస్టరీలో సాయి పాత్ర ఎంత ఉందన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆడియో క్లిప్పింగులు సీసీ పుటేజీల ఆధారంగా శ్రావణిపై సాయి వేధింపులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. విచారణలో సాయి చెప్పే అంశాలు కీలకంగా మారనున్నాయి.