అనూ బేబీని కాస్త పట్టించుకోండయ్యా…!

0

అను ఇమ్మాన్యుయేల్.. నాని హీరోగా నటించిన ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఈ సినిమా స్టార్ హీరోల పక్కన అవకాశాలను తెచ్చిపెట్టింది కానీ.. సక్సెస్ ను మాత్రం ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘ఆక్సిజన్’ చిత్రాలలో నటించినా ఫలితం లేకుండా పోయింది. అయితే అదే సమయంలో కోలీవుడ్ లో అడుగుపెట్టి ”తుప్పారివాలన్” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో రిలీజై మంచి ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఈ భామకు రావాల్సినంత గుర్తింపు రాలేదు.

ఇదే క్రమంలో అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమాతో మరో డిజాస్టర్ ను అందుకుంది. ‘గీత గోవిందం’ లో గెస్ట్ రోల్ లో కనిపించిన అను.. తెలుగులో మరో ప్రయత్నంగా నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రంలో నటించింది. కానీ ఈసారి కూడా అనూ బేబీని పరాజయమే పలకరించింది. స్టార్ హీరోల సరసన నటించింది కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది అనూ. అందం అభినయం ఉన్నా.. అదృష్టం కలిసిరాక ఐరన్ లెగ్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకుంది. దీంతో తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అను ఇమ్మాన్యుయేల్ హీట్ పెంచే ఫోటోలను అప్లోడ్ చేస్తూ అభిమానులు అలరిస్తూ వస్తోంది.

ఇదిలా ఉండగా అనూ బేబీ ఇప్పుడు తన రెమ్యూనేషన్ తగ్గించేసిందట. కేవలం 40 – 45 లక్షల మధ్య ఫిగర్ కే అనూ సినిమాలు ఒప్పుకోవడానికి రెడీగా ఉందని కాస్టింగ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత క్రైసిస్ పరిస్థితుల్లో భారీ పారితోషకం డిమాండ్ చేసే హీరోయిన్స్ కంటే అనూ ని తీసుకుంటే బడ్జెట్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. మీడియం రేంజ్ హీరోలు ఈ పాప పై ఓ లుక్కేస్తే బాగుటుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.