ఫేడవుట్ బ్యూటీ ఇంకా రేస్ లో ఉన్నట్టేనా?

0

నా పేరు సూర్య.. అజ్ఞతవాసి లాంటి భారీ చిత్రాల్లో అగ్ర హీరోల సరసన నటించినా ఈ అమ్మడికి ఏమాత్రం కలిసి రాలేదు. చిన్న హీరోలతో సక్సెస్ అందుకుని పెద్ద హీరోలతో ఢీలా పడిపోయింది. ఆ తర్వాతా కంబ్యాక్ కోసం చేయని ప్రయత్నం లేదు. ఎంత ట్రై చేసినా ఇన్నాళ్లు సరైన ఆఫర్ అయితే దక్కలేదు. కానీ ఇటీవల అనూ పేరు టాలీవుడ్ సర్కిల్స్ లో పదే పదే రింగవుతోంది.

తాజాగా ఓ అదిరిపోయే ఆఫర్ ని పట్టేసింది అమ్మడు. అను ఇమాన్యూయేల్ ఫేడ్ ఆఫ్ కి దగ్గర పడిపోతుంది అనుకున్నా.. వరుసగా సినిమాలు బాగానే లైన్ లో పెడుతూ ఆశ్చర్యపరుస్తోంది. తాను ఇంకా రేస్ లో ఉన్నాను అనే సంకేతాలు బాగానే ఇస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ మూడు సినిమాలు కమిట్ అయింది. తమిళంలో రెండు సినిమాలు చేస్తోందిట.

అయితే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లి సడెన్ గా ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు రాకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి? అంటే ఈ భామ మనీ కోసం కాకుండా క్రేజ్ కోసం.. సక్సెస్ కోసం వెయిట్ చేయడమేనని అంటున్నారు. అయితే ఈ అతి జాగ్రత్త కారణంగా ఈ బ్యూటీ చాలా క్రేజీ సినిమాలు వదిలేసుకుందన్న గుసుగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి తివిక్రమ్ తో ఈ బ్యూటీ వరుస సినిమాలు చేయాలి. కానీ అరవింద సమేతలో అవకాశం వస్తున్నా చేజేతులారా వదిలేసుకుంది. ఒక్క అదిరిపోయే ఆఫర్ వదులుకున్నా దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిందేగా.. అలా అనూ ఫేడవుట్ క్వీన్ గా మారింది. అయితే ఇప్పుడు మళ్లీ అనూహ్యంగా పుంజుకుంటున్నట్టే కనిపిస్తోంది. అజయ్ భూపతి మహాసముద్రంలో ఒక నాయికగా ఆఫర్ అందుకుంది అమ్మడు. దీంతో పాటు పలువురు దర్శకనిర్మాతలు అనూకి ఆఫర్లు ఇస్తున్నారని సమాచారం.