‘పుష్ప’ లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్…?

0

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీ నటులను కూడా తీసుకునే పనిలో ఉన్నారు ‘పుష్ప’ టీమ్. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకమైన రోల్ లో నటిస్తున్నాడంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఈ పాత్ర కోసం మరో తమిళ యాక్టర్ బాబీ సింహాని తీసుకోవాలని సుక్కు అండ్ టీమ్ డిసైడ్ అయ్యారని అనుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఈ క్రమంలో గతంలో బన్నీ ‘వరుడు’లో విలన్ గా నటించిన ఆర్య పేరు కూడా వినిపించింది. ఇప్పుడు తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ సముద్రఖని ని తీసుకోవాలని ‘పుష్ప’ టీమ్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

కాగా సముద్రఖని ‘రఘువరన్ బి.టెక్’ ‘వి ఐ పి’ చిత్రాలతో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో అప్పలనాయుడుగా కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ సినిమాలో ‘కటారి’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలానే దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలోనూ.. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ లోనూ నటిస్తున్నాడు. తెలుగు తమిళ భాషల్లో బిజీగా ఉన్న సముద్రఖని ‘పుష్ప’ కోసం డేట్స్ సర్దుబాటు చేస్తాడో లేదో చూడాలి. ఇదిలా ఉండగా ‘పుష్ప’ చిత్రం శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందనుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. రష్మిక మందన్న గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. మైత్రీ మూవీస్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.