కేజీఎఫ్-2లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి అవేనట!

0

ఇటీవలి కాలంలో భారతీయ సినీ చరిత్రలో బాహుబలి సినిమా తర్వాత అంతటి స్థాయి విజయం అందుకు సినిమా కేజీఎఫ్. ఆ సినిమా ఈ భాష ఆ భాష అనే తేడా లేకుండా అన్నిచోట్ల సూపర్ హిట్ అయ్యింది. కన్నడనాట హీరోలందరూ.. ఎక్కువగా చేసేది రీమేక్ సినిమాలే. బడ్జెట్ కూడా చాలా తక్కువ. వసూళ్లు కూడా అంతే ఉంటాయి. కానీ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మొదటి సారి భారీగా తెరకెక్కించిన కేజీఎఫ్ ఊహించని స్థాయిలో పాన్ ఇండియా స్థాయి విజయం సాధించింది. ఈ సినిమాతో యశ్ కి ప్రభాస్ లాగే దేశవ్యాప్తంగా పేరు వచ్చింది.

మొదటి పార్టు ఇచ్చిన విజయం ఉత్సాహంతో ప్రస్తుతం అదే కాంబినేషన్లో కేజీఎఫ్-2 సీక్వెల్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలక మైన అధీరా క్యారెక్టర్ ని బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్ పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. కరోనా కారణంగా కొన్ని నెలలపాటు షూటింగ్ కి బ్రేక్ పడింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ తెరకెక్కించడానికి ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇందుకోసం భారీ స్థాయిలో ఆయన ప్లాన్ చేస్తున్నారు. సాహో మాదిరిగా కేజీఎఫ్ ని విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దుతున్నారట. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ షాట్స్ కూడా నాచురల్ గా ఉంటాయట. మొదటి పార్టు బంపర్ హిట్ కావడంతో కేజీఎఫ్ -2పై ప్రేక్షకుల్లో ట్రేడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యశ్ కు జతగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది.