నందమూరి బాలకృష్ణ ‘నర్తనశాల’ ఫస్ట్ లుక్…!

0

నటసింహ నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో 17 ఏళ్ళ క్రితం ”నర్తనశాల” అనే పౌరాణిక చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అర్జునుడిగా బాలకృష్ణ.. ద్రౌపది గా సౌందర్య.. భీముడిగా శ్రీహరి.. ధర్మరాజుగా శరత్ బాబులతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. బాలయ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న ‘నర్తనశాల’కు తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి భారీ తారాగణంతో రూపొందిస్తున్నారని తెలియయడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరుపుకున్న తర్వాత హీరోయిన్ సౌదర్య ప్రమాదవశాత్తు మరణించడంతో బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘నర్తనశాల’ అర్థాంతరంగా ఆగిపోయింది. అయితే షూట్ చేయబడిన 17 నిమిషాల గల సన్నివేశాలను విజయదశమి సందర్భంగా అక్టోబర్ 24న డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నట్టు బాలకృష్ణ తెలిపారు.

తాజాగా ‘నర్తనశాల’ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయబడింది. ఈ పోస్టర్ ద్వారా అర్జునుడిగా కనిపిస్తున్న బాలకృష్ణ లుక్ ని రిలీజ్ చేశారు. బాలయ్య ‘నర్తనశాల’ పౌరాణిక చిత్రాన్ని ఎన్బికె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో అక్టోబర్ 24న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా ఛైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ”ఎన్బీకే థియేటర్ లో ‘నర్తనశాల’ను విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది. శ్రేయాస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఎన్బీకే థియేటర్ లో సినిమా చూడవచ్చు. టికెట్ ధర మినిమమ్ రూ. 50 పెట్టాలనుకుంటున్నాం. టిక్కెట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బాలకృష్ణ బసవతారకం ట్రస్ట్ కు ఇస్తామన్నారు” అని చెప్పారు.