స్కిన్ షోతో దుమారం దేనికోసం అను?

0

కెరీర్ ఆరంభం ఏకంగా మెగా కాంపౌండ్ హీరోలతోనే నటించింది. పవన్ కల్యాణ్ .. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు ఏరి కోరి ఈ ఎన్నారై గాళ్ ని ఎంపిక చేసుకున్నారు. టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో నటించే అరుదైన అవకాశం వరించింది. కానీ ఏం లాభాం .. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా అయ్యింది. ఆ రెండూ డిజాస్టర్లుగా నిలవడం తనకు అన్ని విధాలా మైనస్ అయ్యింది. అప్పటివరకూ మీడియం బడ్జెట్ సినిమాలు యంగ్ హీరోలతో నటించి వరుస విజయాలు అందుకున్న అమ్మడు కాస్తా ఒక్కసారిగా డీలా పడిపోయింది. కారణం ఏదైనా దీనిని ఫేట్ అని అంటారు! అన్నది అర్థం చేసుకుంది.

ఇక తమిళం సహా ఇతర భాషల్లో చేసిన ప్రయత్నాలేవీ కూడా తనకు అంతగా కలిసొచ్చినట్టు కనిపించడం లేదు. టాలీవుడ్ సహా ఇతర పరిశ్రమల్లో ఆశించినదేదీ జరగడం లేదు. అయితే ఇలాంటి సన్నివేశం లో కూడా ఈ అమ్మడు అలుపెరగని పోరాటం చేసేందుకే నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల వరుసగా సామాజిక మాధ్యమాల్లో అదిరిపోయే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. బొద్దుతనం కాస్తా తగ్గి స్లిమ్ముగా మారింది. ఈ కొత్త రూపానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తోంది.

అయితే ఇన్ని చేస్తున్న ఈ అమ్మడు ఎవరు? అంటే.. ఇంకెవరు.. ఎన్నారై గాళ్ అను ఇమాన్యుయేల్. తాజాగా అనూ గ్లామర్ షో బోల్డ్ స్క్రిప్ట్ ల కోసమేనని అర్థమవుతోంది. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలన్న పంతంతో ఉంది ఈ భామ. లేటెస్టుగా కొన్ని వేడెక్కించే ఫోటోల్ని ఈ అమ్మడు రివీల్ చేయడం షాకిస్తోంది. తాజా ఫోటోషూట్లలో అను స్లిమ్ గా వేడిగా కనిపిస్తోంది. ఇక బెల్లంకొండ శ్రీను సరసన `అల్లుడు అదుర్స్` అనే చిత్రంతో అను తిరిగి రేస్ లోకి వస్తోంది. ఇందులో మంచి పాత్రలో కనిపించనుందిట. మంచి స్కిన్ షోతో దుమారమే రేపుతుందన్నది ఇన్ సైడ్ గుసగుస. కనీసం ఈసారైనా హిట్టొస్తే మరికొంతకాలం కెరీర్ డ్రైవ్ కొనసాగుతుందన్నమాట.