బాబోయ్ మరీ ఇంత సన్నగా తయారయ్యిందేంటి?

0

తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయ్యి తెలుగు ప్రేక్షకులకు నేను శైలజ సినిమాతో దగ్గర అయిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తెలుగులో ఆచితూచి సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాకుండా ఆ సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ డం దక్కించుకుంది. భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ వరుసగా సినిమాలు చేస్తోంది. ఒక వైపు కమర్షియల్ హీరోయిన్ గా చేస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ నటిగా నిరూపించుకుంటుంది. కీర్తి సురేష్ ను మహానటి సినిమా వరకు కాస్త బొద్దుగా ఉన్న లుక్ లో మనం చూశాం. కాని ఆ తర్వాత ఆమె సన్నబడుతూ వచ్చింది.

ఈ లాక్ డౌన్ లో ఆమె మరీ సన్నబడ్డట్లుగా ఈ ఫొటోను చూస్తుంటే అనిపిస్తుంది. ఒంటి మీద కేజీ కండ లేదు అన్నట్లుగా కీర్తి సురేష్ ను ఈ ఫొటోలో చూస్తుంటే అనిపిస్తుంది. ఏదైనా కెమెరా ట్రిక్ తో ఇలా సన్నగా అయ్యిందా లేదంటే కీర్తి నిజంగానే ఇంత సన్నగా మారిందా అంటూ అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్స్ నాజూకుగా ఉంటేనే బాగుంటారు. అలా అని ఇలా పీలగా ఉంటే ఏం బాగుంటుందంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. కీర్తి సురేష్ తన మంచి లుక్ ను చెడగొట్టుకుందేమో అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ మరియు సినీ వర్గాల వారు సైతం కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి కాస్త లావు అవ్వాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.