Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘మజ్ను’భామ ముక్కెరతో గుండెలకు గాలం వేస్తోందిగా..!

‘మజ్ను’భామ ముక్కెరతో గుండెలకు గాలం వేస్తోందిగా..!


ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్స్ టీనేజ్ లోనే సినిమా అవకాశాలు దక్కించుకుంటారు. హీరోయిన్లుగా ఇండస్ట్రీలో అడుగుపెడతారు. కానీ ఇండస్ట్రీ గురించి ఫ్యూచర్ సినిమాల గురించి అవగాహన లేక.. ఎంత తక్కువ వయసులో ఎంట్రీ ఇచ్చారో అంతే వేగంగా కెరీర్ లో వెనకబడిపోతారు. అందం అభినయం ఉన్నా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఆఫర్స్ రావడం కష్టమనే విషయాన్నీ కెరీర్ మూలనపడ్డాక ఆలస్యంగా గ్రహిస్తారు. సినీ ఇండస్ట్రీలో ఈ విధంగా కెరీర్ పోగొట్టుకున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉంటారు. కానీ కొందరు మాత్రమే నిత్యం కొత్త అవకాశాలకోసం ట్రై చేస్తుంటారు. అంత త్వరగా ఇండస్ట్రీని వదిలిపోలేరు. అలాంటి ముద్దుగుమ్మలలో ఒకరు అను ఇమ్మానుయేల్.

ఈ వయ్యారి 19ఏళ్ళకే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ తెలుగుకంటే ముందే కన్నడలో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. అయితే మజ్ను సినిమా మంచి హిట్ అవ్వడంతో అమ్మడికి తెలుగులో ఎంట్రీ హిట్ లభించింది. కానీ సెకండ్ సినిమా నుండే అనుకి కష్టాలు మొదలయ్యాయి. కెరీర్ పరంగా ఎలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలో తెలియలేదు. కన్ఫ్యూషన్ లో ఆఫర్స్ వస్తున్నాయి కదా.. అని చేసికుంటూ వెళ్ళింది. తీరా వరుస ప్లాప్స్ వెనకేసుకొని ఇప్పుడు వచ్చిన సినిమాలు చేస్తోంది. అమ్మడికి సినిమాలు లేకపోతే సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్ లతో బ్రతికేస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో అను కొత్త పిక్ పోస్ట్ చేసింది. సోఫాలో స్టైలిష్ పోజుతో కనిపించింది. రెడ్ డ్రెస్సులో ముక్కుపుడక పెట్టుకొని రెట్టింపు అందంతో మెరుస్తుంది అను. ప్రస్తుతం ఆ పిక్ చూస్తూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అను ఇప్పుడు మహాసముద్రం సినిమాలో నటిస్తోంది.