సుశాంత్ ఆయన్ని దెయ్యంలా వెంటాడేవాడట

0

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి అరెస్టు అనంతరం రకరకాల పరిణామాలు తెలిసిందే. రియా అరెస్టును పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. తనని మాత్రమే టార్గెట్ చేయడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇందులో అనురాగ్ కశ్యప్ వంటి దర్శకుడు ఉన్నారు.

ఆయన ఇదివరకూ సుశాంత్ సింగ్ పై రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. సుశాంత్ కాంప్లికేటెడ్ అని తాను కథలు వినిపించినా పెద్ద దర్శకులతో మాత్రమే సినిమాలు చేయాలని ప్రయత్నించాడని అన్నారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే అతడితో తాను సినిమా చేయలేదని కూడా వెల్లడించారు.

తాజాగా ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ ఓ వాట్సాప్ చాట్ ని కూడా చూపించారు. ఇందులో సుశాంత్ తనను దెయ్యంలా వెంటాడని అన్నారు. మేం సినిమా చేయాలని చూసినా అభిప్రాయ భేధాలతో కుదరలేదని.. మేనేజర్ సమన్వయం చేయడానికి చూశారని అనురాగ్ తెలిపారు. తాను కథలు చెప్పినా సుశాంత్ పెద్ద నిర్మాణ సంస్థలు.. పెద్ద స్థాయి దర్శకుల కోసమే ప్రయత్నించేవాడని అన్నారు. అయితే ఆ గ్రజ్ లేకుండా తాను మరోసారి సుశాంత్ తో మాట్లాడాల్సిందని రియలైజ్ అయినట్టు వెల్లడించారు. అయితే సుశాంత్ మరణం తర్వాత ప్రతి ఒక్కరూ తనని రకరకాలుగా వేధిస్తూ ప్రశ్నించారని ఆవేదనను వ్యక్తం చేశారు. చిత్రమైన ప్రశ్నలతో రక్తం తాగుతున్నారని అన్నారు. ఇక రిపబ్లిక్ టీవీ లో మేం ఏం చెప్పినా వినరని కూడా ఆయన అన్నారు. సుశాంత్ తో వాట్సాప్ చాటింగులో మహేష్ భట్ ప్రస్థావన రావడం కూడా ఆసక్తికరం.