బాబోయ్.. ఈ యాంకరమ్మ గ్లామర్ చూస్తే మతిపోవాల్సిందే!!

0

అనూష దండేకర్. ఈ బ్యూటీ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. ఎందుకంటే బాలీవుడ్ సినీ ప్రేక్షకులకు టీవీ ప్రేక్షకులకు ఈ భామ ఒక విజే.. టీవీ షోల హోస్టుగా సుపరిచితమే. మరాఠీ ఫ్యామిలీకి చెందిన అనూష సుడాన్ దేశంలో జన్మించింది. గతంలో పూణేలో స్థిరపడిన ఈ భామ ఆ తర్వాత సిడ్నీలో తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది. ఇక 19యేళ్ళ వయసులో సినీరంగం పై ఇంటరెస్ట్ తో ముంబై చేరిన అనూష.. 2002లో ఎంటీవీ ప్రసారం చేసిన ‘హౌస్ ఆఫ్ స్టైల్’ అనే టీవీ షోతో యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్నో టీవీ షోలకు యాంకరింగ్ చేసి ఎంతో పాపులారిటీ దక్కించుకుంది. కానీ ఎక్కువగా ఎంటీవీకి సంబంధించిన టీవీ షోలలోనే అనూష వర్క్ చేసింది. ఎంటీవీ డాన్స్ క్రూ.. ఎంటీవీ టీన్ దివా.. న్యూస్ అండ్ ఎంటీవీ లవ్ స్కూల్.. అలా ప్రోగ్రాంలు చేస్తూ టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక 2008లో బెస్ట్ వీజేగా.. కాస్మోపాలిటన్ ఫన్ ఫియర్లెస్ ఫిమేల్ అవార్డు అందుకుంది. ఇక 2014లో ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్ అనే షోలో లిసా హేడెన్ తో కలిసి జడ్జిగా కూడా వ్యవహరించింది భామ.

ఇదిలా ఉండగా.. అనూష 2003లో ముంబై మాట్నీ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక 2005లో లెజెండ్ అమితాబ్ బచ్చన్ నటించిన విరుద్ధ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ సినిమాకు గాను అనూష మహారాష్ట్ర టైమ్స్ నుండి బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘ఆంథోనీ కౌన్ హై’ సినిమా చేసింది. ఇక 2012లో మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. అదే ఏడాది ‘బెటర్ థెన్ యువర్ ఎక్స్’ అనే ఇంగ్లీష్ సాంగ్ తో గాయనిగా మారింది. అనూష దండేకర్.. కాస్మోపాలిటన్ ఇల్లే సెవెంటీన్ లాంటి కవర్ పేజీలకు ఫ్యాషన్ ఐకాన్ గా పేరు పొందింది. ఇక 2017లో ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్ ప్రోగ్రాం మెంటర్ గా వ్యవహరించింది అనూష దండేకర్. ఇక అనూష వీజేగా.. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. తాజాగా అమ్మడు రెడ్ బికినీలో సెల్ఫీ తీసుకున్న పిక్ షేర్ చేసింది. ఆ ఫోటో చూస్తూ కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఆ బికినీలో అమ్మడి అందాలు చూస్తూ మతుల్ పోతున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నటుడు కరణ్ కుంద్రాతో అనూష డేటింగులో ఉన్నట్లు తెలుస్తుంది.