టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నిశబ్దం సినిమా తర్వాత సైలెంట్ అయ్యింది. ఆమె తదుపరి సినిమా ఏంటా అంటూ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో ఆమె ఏ పబ్లిక్ కార్యక్రమాల్లో కూడా కనిపించలేదు. దాంతో అనుష్క ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఆమె ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో మహా నందీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు స్నేహితులతో కలిసి వెళ్లింది.
నదిలో సింపుల్ గా బోట్ ప్రయాణం చేసిన ఆమెను చాలా మంది గుర్తించలేదు. మాస్క్ ధరించి ఉన్న కారణంగా ఆమెను స్థానికులు పట్టించుకోలేదు. కాని ఒక్కరు ఇద్దరు మాత్రం ఆమె అనుష్కగా గుర్తించి ఆమె వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఉన్నట్లుండి మహా నందీశ్వర ఆలయం వద్ద అనుష్క ప్రత్యక్షం అవ్వడం ఏంటో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. దైవ భక్తి ఎక్కువ అయిన అనుష్క గతంలో కూడా మహా నందీశ్వర స్వామి ఆలయంను సందర్శించారు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఆమె సాహస యాత్ర చేసి మరీ స్వామి వారి ఆలయంను సందర్శించారు. వచ్చే ఏడాది ఆరంభంలో అనుష్క సినిమా ప్రకటన ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.