ప్రభాస్ `ఆదిపురుష్ 3డి`లో ముగ్గురు భామలా?

0

ప్రభాస్ `ఆదిపురుష్ 3డి`కి సంబంధించిన ప్రతి వార్తా సెన్సేషన్ అవుతున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో హీట్ పెంచేస్తున్నాడు. ఇక తానాజీ 3డి చిత్రంతో ఓంరౌత్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోవడంతో బాహుబలి స్టార్ తానాజీ డైరెక్టర్ మూవీగా `ఆదిపురుష్ 3డి`పై అసాధారణ అంచనాలేర్పడ్డాయి. పైగా ఓవైపు నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న ప్రభాస్ ఇలా వైవిధ్యమైన కాన్సెప్టును ఎంచుకోవడంతో అందరి కళ్లు ఈ మూవీపైనే ఉన్నాయి.

ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మెలూహా తరహా పాత్ర చిత్రణ రక్తి కట్టిస్తుందని ప్రభాస్ శ్రీరాముడి లుక్ తో కనిపిస్తాడని చెబుతుండడంతో ఈ ఫిక్షనల్ పాత్రపై క్యూరియాసిటీ అంతకంతకు రెయిజ్ అవుతోంది. ఇప్పటికే ఆదిపురుష్ లో సీత తరహా పాత్రకు కృతి సనాన్ పేరును పరిశీలించారని కథనాలొచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం.. మరో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయన్న గుసగుసలు వేడెక్కిస్తున్నాయి. ఆదిపురుష్ భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాగా పాపులరవ్వడంతో కథానాయికల వెయిట్ కూడా పెరిగింది. ఇందులో శ్రద్ధా కపూర్ .. కియారా అద్వానీలను కూడా నాయికలుగా నటింపజేసేందుకు మేకర్స్ సంప్రదిస్తున్నారట. శ్రద్ధా ఇంతకుముందు సాహోలో ప్రభాస్ తో నటించినా.. కియారా కు మాత్రం ఆ ఛాన్స్ ఇదే తొలిసారి. అయితే దీనిని చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతానికి ముంబై మీడియాలో వైరల్ అయిన గాసిప్ ఇది. 2021 ఆరంభంలో చిత్రీకరణ ప్రాంభించి చివరిలో రిలీజ్ చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్ అని తెలుస్తోంది.