తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అరియానా ఒక సాదా సీదా అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చింది. తాను బోల్డ్ గా ఉంటాను బోల్డ్ గా మాట్లాడుతాను అంటూ ఇంట్రో వీడియోలో చెప్పిన అరియానా నిజంగా అలా ఉండలేస్తుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. కాని మొదటి నుండి చివరి వరకు అరియానా ఫైటర్ లా పోరాడింది. నిజంగా అరియానా అద్బుతంగా పోరాటం సాగించింది. విజయాన్ని సొంతం చేసుకోలేక పోయినా కూడా టాప్ 4 లో ఉండి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఒకానొక సమయంలో అరియానా విజేత అయ్యేనేమో అంటూ ప్రచారం కూడ ఆ జరిగింది. అలాంటి అరియానా పెళ్లి.. ప్రేమ విషయంలో బయట ఉన్న పుకార్లకు చెక్ పెట్టేలా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది.
ఆ ఇంటర్వ్యూలో.. అవినాష్ తో నాది కేవలం స్నేహం మాత్రమే. మేము ఇద్దరం మంచి స్నేహితులుగా ఇంట్లో కొనసాగాం ఇకపై కూడా మంచి స్నేహితులుగా ఉంటాం. మా ఇద్దరి మద్య అంతకు మించి ఏమీ ఉండదు అంటూ స్పష్టతనిచ్చింది. ఇక పెళ్లి గురించి ప్లాన్స్ ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో.. నేను ఎక్కువగా మాట్లాడుతాను కనుక వచ్చే వాడు కాస్త సైలెంట్ అయితే బెటర్. అతడు నాపై ఎక్కువ ప్రేమను చూపించాలి. పెళ్లి తర్వాత కూడా జాబ్ చేస్తాను కనుక రాత్రి సమయంలో షూట్ అయిపోగానే వచ్చి పికప్ చేసుకోవాలి కాని పదే పదే కాల్ చేసి ఇంకా ఎంత సేపు అంటూ విసిగించొద్దు. నన్ను పూర్తిగా అర్థం చేసుకుని పూర్తి కంఫర్ట్ ఇచ్చే వాడు కావాలని అరియానా కోరుకుంటుందట. మరీ ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వాడు దొరకాలంటే కష్టమే కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.