అస్మితా అండర్ వాటర్ అడ్వెంచర్

0

మోడలింగ్ నుంచి టీవీ రంగం అట్నుంచి సినీరంగంలో ప్రయత్నించి చివరికి కెరీర్ పరంగా ఆశించనిది దక్కక అంతంత మాత్రం ఆఫర్లతోనే వెనుదిరిగిన బ్యూటీ అస్మితా సూద్. 2011 తెలుగు చిత్రం బ్రమ్మీగాడి కథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ క్రమంలోనే అస్మితా సూద్ ఏకంగా 40 బ్రాండ్లకు ప్రచార కర్తగా ఎంపికైంది.

అలాగే రెండు టెలివిజన్ షోలతోనూ టీవీక్షకులకు చేరువైంది. స్టార్ ప్లస్ యొక్క ఫిర్ భీ నా మనే … బడ్తామీజ్ దిల్ .. సోనీ టివి దిల్ హాయ్ తో హై ఫోటతో టీవీ ఆడియెన్ కి చేరువైంది. అస్మితా సూద్ హిమాచల్ ప్రదేశ్ – సిమ్లాకు చెందిన బ్యూటీ. ఆమె కామర్స్ గ్రాడ్యుయేట్.

టీవీ రియాలిటీ షో ఛానల్ V గెట్ గార్జియస్ లో పాల్గొన్న తరువాత 2010 చివరిలో అస్మిత తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది. తరువాత ఆమె 2011 ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొంది ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచింది. వృత్తిపరంగా శిక్షణ పొందిన కథక్ నర్తకి.

తెలుగు చిత్రం బ్రమ్మీగాడి కథ (2011) తో సూద్ తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఇందులో వరుణ్ సందేశ్ కథానాయకుడిగా నటించారు. 2013 లో విక్టరీతో కన్నడ రంగంలో అడుగుపెట్టింది. అలాగే సుధీర్ బాబు సరసన ఆడు మగాడ్రా బుజ్జీలో కనిపించింది. కానీ ఇవేవీ ఈ సిమ్లా బ్యూటీకి ఏమాత్రం కలిసి రాలేదు. ప్రస్తుతం ఇతర నాయికల్లానే అవకాశాల వేటలో ఉంది. తాజాగా ఈ భామ అండర్ వాటర్ సాహసానికి చెందిన ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.