బూతుకే పట్టం కట్టిన ప్రేక్షకులు..!

0

కరోనా కారణంగా మూతబడిన థియేటర్స్ ఇప్పుడిప్పుడే రీ ఓపెన్ చేస్తున్నారు. తమిళనాడులో కూడా అక్కడ థియేటర్స్ మల్టీప్లెక్సులు తెరిచారు. దీపావళి సందర్భంగా రెండు మూడు చిన్న సినిమాలను థియేట్రికల్ రిలీజ్ చేశారు. కోవిడ్ నేపథ్యంలో జనాలు థియేటర్స్ కి వస్తారో లేదో అనే ఆలోచనతో కొన్ని స్క్రీన్స్ లో మాత్రమే వాటిని ప్రసారం చేసారు. ఈ క్రమంలో ‘చితక్కొట్టుడు 2’ సినిమాకి తమిళ్ వర్షన్ ‘ఇరుత్తు అరియిల్ మురత్తు కూత్తు’ చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వం వహించారు. రాక్ ఫోర్ట్ టి.మురగనాథమ్ సమర్పణలో ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. హరి భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అడల్ట్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తమిళనాట హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోందని తెలుస్తోంది.

కొన్ని నెలల పాటు థియేటర్ ఎక్సపీరియన్స్ కి దూరంగా ఉన్న జనాలు.. ఈ బూతు సినిమాకి పట్టం కట్టినట్లు అర్థం అవుతోంది. కోవిడ్ నేపథ్యంలో లైఫ్ రిస్క్ చేసి ప్రేక్షకులు థియేటర్ కి వస్తారో రారో అనుకుంటున్న సమయంలో ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో నడవడం సంతోషించదగ్గ విషయమనే చెప్పాలి. కాకపోతే అడల్ట్ కంటెంట్ తో వచ్చిన సినిమా కావడం.. లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ చేయడం కూడా దీనికి కారణమని అంటున్నారు. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందే బోల్డ్ సన్నివేశాలతో టీజర్.. ట్రైలర్స్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ అందరి చూపు సినిమా వైపు తిప్పుకునేలా చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఏదేమైనా బూతు కంటెంట్ నే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని అర్థం అవుతుంది. లాక్ డౌన్ లో కూడా ఓటీటీలలో వచ్చే అడల్ట్ వెబ్ సిరీస్ లు ఎక్కువ ఆదరణ పొందాయి