అవినాష్ కు పెళ్లి కావద్దంటూ శాపం పెట్టిన అరియానా

0

బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ మరియు అరియానాల మద్య మంచి స్నేహం ఉంది. ఇద్దరి మద్య చిన్న చిన్న గొడవలే తప్ప ఇప్పటి వరకు పెద్ద గొడవలు ఏమీ జరగలేదు. చిన్న చిన్న ఇష్యూలు జరిగితే వెంటనే వాటిని పరిష్కరించుకున్నారు. ఇద్దరి మద్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా నడుస్తుంది. అందుకే వీరిద్దరి పై అభిమానులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు అనడంలో సందేహం లేదు. అరియానా మరియు అవినాష్ లు ప్రతి రోజు ఒకరికి ఒకరు తినిపించుకోవడంతో పాటు మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారు.

నిన్నటి ఎపిసోడ్ లో ఉదయం టిఫిన్ తినుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకున్నారు. అవినాష్ కు నేను చాలా సార్లు సపోర్ట్ చేశాను అంటూ అరియానా అంది. మొన్న ఎవిక్షన్ పాస్ లభించడంలో కూడా నేను నీ వెంట ఉన్నాను అంటూ అరియానా చెప్పింది. ఆ సమయంలో అవినాష్ స్పందిస్తూ నేను కూడా నీ కోసం చాలా చేశాను అన్నాడు. ఏం చేశావు నువ్వు అంటూ ఎదురు ప్రశ్నించింది. ప్రతి రోజు నేనే కదా నీకు తినిపించింది ఆరోగ్యం బాగా లేని సమయంలో చాలా చేశాను అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు కూడా ఫన్నీగా తిట్టుకోవడం మొదలు పెట్టారు.

ఇద్దరు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. చివరకు అవినాష్ కు రాబోయే రెండు మూడు సంవత్సరాల వరకు పెళ్లి కావద్దు దేవుడా అంటూ అరియానా ప్రార్థించింది. అరియానా ప్రార్థనతో అవినాష్ షాక్ అయ్యాడు. దొంగ మొహం దానా అంటూ తిట్టాడు. అదే సమయంలో వచ్చే ఏడాది మే వరకు నేను పెళ్లి చేసుకుని తీరతాను అంటూ అవినాష్ ఛాలెంజ్ చేశాడు. అరియానా శాపం ఫలితస్తుందా.. అవినాష్ ఛాలెంజ్ నిలుస్తుందా అనేది చూడాలి.