బిబి3 విడుదల తర్వాతే కొత్త ప్రాజెక్ట్

0

నందమూరి బాలకృష్ణ బోయపాటిల కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. కరోనా కారణంగా షూటింగ్ నిలిచి పోయింది. ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల నుండి పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే బాలయ్య తదుపరి సినిమాల విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బాలయ్య తదుపరి సినిమాను వివి వినాయక్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని నందమూరి వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న బోయపాటి మూవీ పూర్తి అయ్యి విడుదలైన తర్వాతే దాని ఫలితాన్ని బట్టి కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించాలని భావిస్తున్నాడట.

వచ్చే ఏడాది సమ్మర్ లో బాలకృష్ణ మరియు బోయపాటి కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు బోయపాటి చేస్తున్నాడు. షూటింగ్ ను ప్రారంభించి ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా షూటింగ్ చేసి దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అప్పటి వరకు కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం లేదు అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య కోసం సాయి మాధవ్ బుర్రా మరియు కోన వెంకట్ లు కథలు రెడీ చేస్తున్నారట. ఇక బాలయ్య కోసం చాలా రోజులుగా ఒక ప్రాజెక్ట్ ను పరుచూరి బ్రదర్స్ రెడీ చేస్తున్నారు. ఈ మూడు స్క్రిప్ట్ ల్లో ఒకదాన్ని బిబి3 తర్వాత బాలయ్య చేసే అవకాశం ఉంది. దర్శకుడు ఎవరు అనే విషయంలో కూడా అప్పుడే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.