నితిన్ -ఏలేటి `చెక్` .. కొరటాల ఆల్ ది బెస్ట్

0

భీష్మ లాంటి సక్సస్ ఫుల్ మూవీ తర్వాత నితిన్ స్పీడ్ పెంచేసిన సంగతి తెలిసిందే. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా చిత్రీకరణలు పూర్తి చేసి రిలీజ్ చేయాలన్న పంతం కనిపిస్తోంది. `రంగ్ దే` (వెంకీ అట్లూరి) రిలీజ్ కి రావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటుగా విలక్షణ చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తో కలిసి ఓ సినిమాకి పని చేస్తున్న సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా `చెక్` అనే టైటిల్ ని ఫైనల్ చేయగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల టైటిల్ సహా ప్రీలుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

టైటిల్ పోస్టర్ సరికొత్త కాన్సెప్టుతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ కేసు విషయమై డ్రామా నేపథ్యంలో ఆద్యంతం గ్రిప్పింగ్ గా రూపొందిస్తున్న సినిమా ఇదని తెలుస్తోంది. నితిన్ చేతికి భేడీలు జైలు చుట్టూ బారికేడ్లు .. చదరంగం కాన్సెప్ట్ చూస్తుంటే ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఉంటుందనే అర్థమవుతోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ – ప్రియా వారియర్ నాయికలుగా నటిస్తున్నారు.

చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇదని నితిన్ నటన అద్భుతంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. చిత్రీకరణ ముగింపులో ఉందని తెలిపారు. నితిన్ నటన మరో లెవెల్ లో వుంటుందని భవ్య ఆనంద ప్రసాద్ తెలిపారు. చెక్ టీమ్ కి `ఆచార్య` దర్శకుడు కొరటాల శివ ఆల్ ది బెస్ట్ తెలిపారు. తన ఫేవరెట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి రూపొందిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రీలుక్ లాంచ్ చేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు.