Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాలయ్య ‘బలరామయ్య బరిలోకి దిగితే’

బాలయ్య ‘బలరామయ్య బరిలోకి దిగితే’


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆ సినిమా షూటింగ్ ను త్వరలోనే పునః ప్రారంభించే అవకాశం ఉంది. సమ్మర్ చివరి వరకు సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసమయంలోనే బాలకృష్ణ తదుపరి సినిమా గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. చాలా రోజులుగా బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య మూవీ అన్నారు. కాని అది అధికారికంగా ప్రకటన రాలేదు. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు దర్శకులతో బాలయ్య మూవీ అన్నారు. కాని తాజాగా మరో కొత్త దర్శకుడి పేరు వినిపిస్తుంది. ఈ సారి ఒక ఆసక్తికర టైటిల్ కూడా చర్చల్లో నిలిచింది.

బోయపాటి మూవీ తర్వాత బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పాడనే ప్రచారం మీడియా సర్కిల్స్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం అల్లుడు అదుర్స్ సినిమాను బెల్లంకొండతో సంతోష్ శ్రీనివాస్ చేస్తున్నాడు. ఆ సినిమా ముగింపు దశకు వచ్చింది. తాజాగా బాలకృష్ణ కు ఈయన కథను వినిపించడం జరిగిందట. బాలయ్య కూడా కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి యాక్షన్ డ్రామా అవ్వడం వల్ల వెంటనే చేసేందుకు ఓకే చెప్పాడట. ఈ విషయంలో బాలకృష్ణ సన్నిహితుల నుండి అనధికారికంగా క్లారిటీ వస్తుంది.

ఈ సినిమా కోసం సంతోష్ శ్రీనివాస్ ‘బలరామయ్య బరిలోకి దిగితే’ అనే విభిన్నమైన టైటిల్ ను కూడా రిజిస్ట్రర్ చేశాడట. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ తీస్తాడని అంటున్నారు. వీరి కాంబో మూవీ 2021లో ప్రారంభం అయ్యి 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.