మహేష్ బాబుతో బాలయ్య బాబు..!

0

టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. సినిమాల్లో కలిసి నటించేది పక్కన పెడితే ఓకే వేదికపై కనిపించడం కూడా తక్కువే. ఏదో సెలబ్రిటీల పెళ్లి వేడుకల్లోనో సినిమా ఫంక్షన్స్ లోనో విషాద ఘనటనలు జరిగినప్పుడో స్టార్ట్ హీరోలు ఒక చోట కనిపిస్తుంటారు. ఒకవేళ ఒకే ఫొటోలో కనిపిస్తే మాత్రం అభిమానులకు పండుగ అనే చెప్పాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు – నందమూరి బాలకృష్ణ కలిసి ఉన్న ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ ఫొటోలో బాలయ్య – మహేష్ పక్కపక్కనే కూర్చొని దేని గురించో చర్చిస్తున్నట్లు అనిపిస్తుంది. వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో కృష్ణ – బాలకృష్ణ కలిసి ‘సుల్తాన్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ – బాలయ్య ఉన్న ఈ పిక్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణించినప్పటిదని నెటిజన్స్ అంటున్నారు. ఇది ఎప్పటి పిక్ అన్నది క్లారిటీ లేనప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. మహేష్ బాబు పరశురామ్ డైరెక్షన్ లో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నారు.