అషుతో రియల్ రిలేషన్ షిప్ ప్రకటించిన బిబి విన్నర్ రాహుల్

0

సింగర్.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పేరు చెప్పగానే పునర్నవి గుర్తుకు వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 3 సమయంలో వారిద్దరిపై వచ్చిన పుకార్లు.. వారిద్దరి మద్య నడిచిన వ్యవహారం అంతా ఇంతా కాదు. అది అంతా షో కే అని తేలిపోయింది. బిగ్ బాస్ లో ఉన్నంత వరకే కాకుండా పున్నుతో రాహుల్ స్నేహం కొనసాగుతుంటే ఇద్దరి మద్య ఇంకా ఏమైనా ఉందేమో.. నడుస్తుందేమో అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేశారు. కాని అదేం లేదు అంటూ పదే పదే పున్ను క్లారిటీ ఇచ్చింది. రాహుల్ సడెన్ గా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డితో రిలేషన్ లో ఉన్నట్లుగా సోషల్ మీడియా ద్వారా చెప్పడం అందరికి ఆశ్చర్యంను కలిగిస్తుంది.

బ్యాక్ టు అవర్ రియల్ రిలేషన్ షిప్ అంటూ ఈ ఫొటోను షేర్ చేసిన రాహుల్ అందరిని ఆశ్చర్యపర్చాడు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ అయిన అషు రెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు ఈమెను జూనియర్ సమంత అంటూ పిలిచేవారు. ఇక పవన్ కళ్యాణ్ పేరును తన శరీరంలోని సీక్రెట్ పార్ట్ లో టాటూ వేయించుకోవడంతో ఈమెకు మరింత పాపులారిటీ దక్కింది. రాహుల్ సిప్లిగంజ్ మరియు అషులు ఒక వీడియో ఆల్బంలో నటించారు. అందులో ముద్దు సీన్ కూడా చేయడం జరిగింది.

ఎక్కువ శాతం పున్నుతో రాహుల్ పేరు వినిపిస్తున్న కారణంగా ఇన్ని రోజులు అషు తో తిరుగుతున్నా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కాని రాహుల్ స్వయంగా సోషల్ మీడియాలో తాను అషు తో రియల్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా ప్రకటించాడు. ఇటీవల పున్ను ఎంగేజ్ మెంట్ అంటూ పోస్ట్ చేసి ఆ తర్వాత అంతా ఉత్తదే సినిమా ప్రమోషన్ అంది. అందుకే ఇప్పుడు రాహుల్ రియల్ రిలేషన్ షిప్ అంటున్నా కూడా కొందరు మాత్రం నిజం అయ్యి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అషు మాత్రం ఇంకా స్పందించలేదు. ఆమె కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందా అనేది చూడాలి.