రిలేషన్ షిప్ వరకే పెళ్లి ఆలోచన ఆమెకు లేదట

0

సొట్టబుగ్గల సుందరి తాప్సి కొన్నాళ్లుగా బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బో తో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెల్సిందే. ఆమె స్వయంగా తన ఈ విషయాన్ని ప్రకటించింది. ఇటీవల మాల్దీవుల్లో అతడితో కలిసి తాప్సి హాలీడే ను ఎంజాయ్ చేసింది. ఇద్దరు కూడా రొమాంటిక్ ఫొటో షూట్ లతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. దాంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది వీరి పెళ్లి ఉంటుందని జాతీయ మీడియాలో వస్తున్న కథనాలపై తాప్సి మేనేజర్ క్లారిటీ ఇచ్చాడు.

తాప్సికి ప్రస్తుతం పెళ్లి పై ఎలాంటి ఆలోచన లేదు. పెళ్లి విషయంలో ఎలాంటి ప్లానింగ్స్ ను ఆమె చేసుకోవడం లేదు. ప్రస్తుతం ఆమె దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాప్సి హిందీలో రెండు మూడు సినిమాలు చేస్తోంది. తెలుగులో కూడా ఈమె ఒక సినిమాను చేసేందుకు సైన్ చేసింది. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్న తాప్సి పెళ్లి చేసుకుంటే ఆఫర్లు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఆమె రిలేషన్ షిప్ వరకే పెళ్లి ఆలోచన లేదంటుంది. మూడు నాలుగు సంవత్సరాల తర్వాత తాప్సి పెళ్లి గురించి ఏమైనా ఆలోచించే అవకాశం ఉంది.