Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిబి4 : అక్కినేని వారితో పరిచయమే అతడిని విజేతగా నిలుపనుందట!

బిబి4 : అక్కినేని వారితో పరిచయమే అతడిని విజేతగా నిలుపనుందట!


తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ఎవరు అంటే చాలా మంది అభిజిత్ పేరు చెబుతున్నారు. ఆయన టాస్క్ ల విషయంలో వీక్ అయినా కూడా ఆయన్నే ఎక్కువ మంది విన్నర్ అంటున్నారు. ఇప్పటి వరకు కెప్టెన్ కాకున్నా కూడా ఆయన ఆట తీరుకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇదే సమయంలో అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి ప్రధాన కారణంగా ఆయనకు అక్కినేని వారితో ఉన్న సంబంధాలు అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు. నాగచైతన్య మరియు అభిజిత్ లు సన్నిహితులు. మంచి సన్నిహిత సంబంధాలు అక్కినేని కుటుంబంతో అభిజిత్ ఫ్యామిలీకి ఉంది అనే ప్రచారం జరుగుతోంది.

అభిజిత్ ను ఇండస్ట్రీలోకి తీసుకు వచ్చిందే అక్కినేని వారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్ కు ఆఫర్లు రావడం వెనుక ఉన్నది కూడా అక్కినేని వారే అంటున్నారు. కనుక బిగ్ బాస్ విజేతగా అభిజిత్ నిలస్తే అందుకు కూడా కారణం అక్కినేని వారే అయ్యి ఉంటారు అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. అభిజిత్ ను బిగ్ బాస్ లోకి తీసుకు వచ్చిన నాగచైతన్య ఆయన్ను విజేతగా కూడా చూడాలనుకుంటున్నాడు.

నాగార్జున హోస్టింగ్ చేస్తున్న షో అవ్వడం వల్ల తాము అనుకున్న వారిని విజేతగా నిలపడం పెద్ద సమస్య కాదు. సోషల్ మీడియాలో అభిజిత్ కు ఉన్న ఫాలోయింగ్ కారణంగా విజేత ను చేయడం మరింత ఈజీ అయ్యింది అంటున్నారు. కారణం ఏదైనా కూడా ఒక వర్గం వారు మాత్రం అక్కినేని వారితో ఉన్న పరిచం వల్ల అభిజిత్ బిబి 4 ట్రోఫీ ఎత్తబోతున్నాడు అంటున్నారు. అది ఎంత వరకు నిజం అనేది ఆ బిగ్ బాస్ టీం కే తెలియాలి.