బిబి4 విన్నర్.. రన్నరప్ వీరిద్దరే

0

బిగ్ బాస్ విజేతను నిర్ణయించేది.. ఎలిమినేషన్ ను నిర్ణయించేది ప్రేక్షకులు. కాని తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్ అలా జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు అంటూ బిగ్ బాస్ ను రెగ్యులర్ గా క్లోజ్ గా ఫాలో అయ్యే విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఆటను రసవత్తరంగా మార్చాలనే ఉద్దేశ్యంతో పులిహోర బ్యాచ్ ను కంటిన్యూ చేస్తే గత సీజన్ మాదిరిగా ఈ సీజన్ కు మంచి రేటింగ్ వస్తుందని బిగ్ బాస్ టీం భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే మొదట్లోనే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను బయటకు పంపించేశారు. దేవి మరియు కుమార్ సాయి వంటి వారిని ఎలా బయటకు పంపిస్తారు అంటూ విమర్శలు వ్యక్తం అయినా కూడా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు.

ఈ సీజన్ మొత్తం కూడా బిగ్ బాస్ ప్రేక్షకుల ఓట్లతో సంబంధం లేకుండానే కంటిన్యూ అవ్వబోతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వారం కూడా మోనాల్ లేదా అరియానా ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కాని వారిద్దరిని ఎలిమినేట్ చేయకుండా మెహబూబ్ ను ఎలిమినేట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టాస్క్ లు గట్టిగా ఆడుతూ ఉన్న అతడికి జోడీ లేదు. ఆ కారణంగా ఎలిమినేట్ చేశారా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఎలిమినేషన్ ను మాత్రమే కాకుండా విజేతను కూడా బిగ్ బాస్ టీం ఖరారు చేసింది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరియు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సీజన్ విన్నర్ గా అభిజిత్ మరియు రన్నరప్ గా లాస్య నిలిచే అవకాశం ఉందంటున్నారు. టాప్ 5 లో వీరిద్దరితో పాటు అఖిల్.. సోహెల్ మరియు అవినాష్ లు చేరబోతున్నారు. రాబోయే మూడు వారాల్లో మోనాల్.. అరియానా మరియు హారికలు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అంటున్నారు. 99 శాతం అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడు అంటున్నారు.

అభిజిత్ కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఆయనకు గతంలో కౌశల్ కు ఉన్నంత స్థాయిలో సోషల్ మీడియా బలం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు బిగ్ బాస్ టీం నుండి ఆయనకు మద్దతు ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఆయన కాకుండా మరెవ్వరైనా విజేత అయ్యే అవకాశం ఉంది.