విలాసాల భవంతిలో భూమి విరహ గీతం

0

మొన్నటికి మొన్న గణపతి బప్ప మోరియో!! అంటూ భూమి పెడ్నేకర్ సంబరాలు ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. కుటుంబ సమేతంగా విఘ్నవినాయకుని పూజించింది ఈ బ్యూటీ. ఇంట్లో గణపతి విగ్రహాలను తయారుచేసే పర్యావరణ అనుకూల పద్ధతులను ఎన్నుకోవాలని భూమి గత వారం ప్రజలను కోరింది. “ఇది నాకు చాలా ఇష్టమైన పండుగ. నా కుటుంబంలో సంవత్సరాలుగా గణపతి ఉత్సవం జరుపుకుంటున్నాము“ అని తెలిపింది. మన దేశాన్ని రక్షించడానికి విప్లవాత్మక ఆలోచనలు అయిన పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడానికి ప్రజలు ప్రేరేపితులవ్వాలని కోరింది.

అయితే ఇంతలోనే ఇదిగో ఇలా సోషల్ మీడియాల్లో చెలరేగిపోయింది. ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా తనని తాను ఆవిష్కరించుకునే ఈ బ్యూటీ నెవ్వర్ బిఫోర్ లుక్ తో చెలరేగిపోయింది. భూమి టూమచ్ హాట్ అంటూ ఈ ఫోటోలకు అంతర్జాలంలో కామెంట్లు పడిపోతున్నాయ్.

ఖరీదైన విలాసాల భవంతిలో సరాగాలు ప్రదర్శిస్తున్న ఈ హాట్ గాళ్ ని యూత్ అంత తేలిగ్గా మర్చిపోవడం కష్టమే. వైట్ అండ్ పింక్ మిక్స్ డ్ కలర్ శారీలో అలా పవిట జారవేసినట్టుగా ఏమిటో ఈ కవ్వింత? భూమి దెబ్బకు కుర్రకారు షేక్ అయిపోతున్నారు. కాస్మో పాలిటన్ కవర్ పేజీపై ఇదివరకూ చెలరేగిపోయిన అమ్మడు ఇప్పుడు ఈ కొత్త లుక్ లో అదరగొడుతోంది. శుభ్ మంగల్ జాదా సావధాన్ లో ప్రత్యేక అప్పియరెన్స్ ఇచ్చిన భూమి భూత్ -1 ది హాంటెడ్ షిప్ చిత్రం లో నటిస్తోంది. డాలీ కిట్టీ ఔర్ వో ఛమకటే సితారే సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తోంది.