కిడ్నాప్ చేసి కొట్టారు.. నటి వీడియో వెనుక దారుణం

0

మసిక కలైశాఅమెరికన్ నటి రియాలిటీ స్టార్ మసిక కలైశాకు ‘ఓన్లీ ఫ్యాన్స్’ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో అకౌంట్ ఉంది. అయితే తన అకౌంట్ ను ప్రమోట్ చేయడానికి దారుణానికి ఒడిగట్టింది. తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్ చేసింది.

ఒంటిపై పలు చోట్ల గాయాలైనట్లు ఉన్న ఆ వీడియోలో వాపోయింది. నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం లాక్కున్నారని.. నాకు సహాయం చేయండని.. నా అకౌంట్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండని.. అప్పుడే వాళ్లు నన్ను వదిలేస్తారని కన్నీరు పెట్టుకొని ప్రార్థించింది. అయితే నాటకాన్ని నెటిజన్లు పసిగట్టారు.

ఈ వీడియోను చూసి అభిమానులు తోటి నటీనటులు ఆమెపై ఫైర్ అయ్యారు. డబ్బుల కోసం ఇలా నాటకాలు ఆడుతావా? దిగజారుతావా అంటూ మండిపడ్డారు.

దీంతో బండారం బయటపడ్డ మసిక వీడియోను డిలీట్ చేసింది. మహిళల అక్రమరవాణాపై అవగాహన కల్పించడానికే ఈ కొత్త వీడియో చేశానని చెప్పుకొచ్చింది.