బిగ్ బాస్ బేబి బికినీ బీచ్ సెలబ్రేషన్స్

0

తెలుగమ్మాయి తేజస్వి మదివాడ గట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సినీపరిశ్రమలో నిలదొక్కుకునేందుకు తనని తాను ట్యూన్ చేసుకునే విధానం సాటి వారిలో స్ఫూర్తి నింపుతోంది. తెలుగులో అడపాదడపా మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే సోలో నాయికగా మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.

బిగ్ బాస్ తెలుగు తనకు అంతో ఇంతో క్రేజ్ ను తెచ్చింది. అటుపై బుల్లితెర షోల్లోనూ తేజస్వి మెరుపులు మెరిపించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆశించిన ఆఫర్లు అయితే లేవు. అయినా ప్రయత్నం మాత్రం విడవలేదు. 2017లో బాబు బాగా బిజీ.. బాలకృష్ణుడు చిత్రాల్లో నటించింది. `మన ముగ్గురి లవ్ స్టోరి` అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో రూపొందుతున్న కమిట్ మెంట్ అనే వివాదాస్పద సినిమాలోనూ తేజస్వి నటిస్తోంది.

ఈ సినిమాకి సంబంధించి వేడెక్కించే పోస్టర్లు ఇప్పటికే అంతర్జాలంలోకి రిలీజై వైరల్ అయ్యాయి. సినీపరిశ్రమలో అమ్మాయిలు అవకాశాల కోసం వెతికే క్రమంలో ఎదురయ్యే వేధింపుల ఫర్వంపై సినిమా ఇది. ఇంతకుముందు రిలీజ్ చేసిన లుక్ ని బట్టి ఎంత బోల్డ్ గా ఉండబోతోందో అర్థమవుతోంది. అదంతా సరే కానీ.. తేజస్వి ఇటీవల ఇన్ స్టా మాధ్యమంలో ఎంత స్పీడ్ గా ఉంటోందో చూస్తున్నదే.

తాజాగా బీచ్ లో సరిగంగ స్నానాలాడుతున్న ఫోటోని తేజస్వి షేర్ చేసింది. చారల బికినీలో తెలుగమ్మాయి దుమారమే రేపుతోంది. గాల్లోకి లేచిన నీటి బిందువులు తేజస్వి ముఖంపైకి దూసుకొస్తుంటే తేజస్వి చిద్విలాసం మైమరిపిస్తోంది. మొత్తానికి సముద్ర తీరాన తడిపొడి తపనల తమకం ఫలించే రోజొచ్చిందనే చెప్పాలి. మునుముందు వెబ్ సిరీస్ లతో ఈ అమ్మడు హీట్ పెంచేసే అవకాశం కనిపిస్తోంది. ఇక పైనా ఇన్ స్టాలో వరుసగా బికినీ ట్రీట్ కి కొదవేమీ ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు.