ప్రభాస్ తో పోటీపడేలా ఫుల్ లెంగ్త్ రోల్ లో

0

డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల్ని ప్రకటించి షాకిచ్చారు. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి .. నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్షన్ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవి రెండూ వెంటనే వెంటనే సెట్స్ కెళతాయి.

ప్రస్తుతం నాగ్ అశ్విన్ సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే వైజయంతి మూవీస్ ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది. ఇక ఇందులో దీపిక పదుకొణేని కథానాయికగా ఎంపిక చేసుకున్న నాగ్ అశ్విన్ మరో కీలక పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని ఎంపిక చేశారని ఇప్పటికే బిగ్ బి కాల్షీట్లు లాక్ చేశారని ప్రచారం సాగుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బి రోల్ కేవలం అతిథి పాత్ర మాత్రమే కాదు.. పూర్తి స్థాయిలో ప్రభాస్ రోల్ కి ధీటుగా పోటా పోటీగా ఉంటుందని తెలిసింది. ఇందులో ప్రభాస్ సూపర్ హీరో తరహా రోల్ లో కనిపిస్తారని యాక్షన్ అదిరిపోయే రేంజులో ఉంటుందని ప్రచారమవుతోంది. బిగ్ బి ఇంతకుముందు సైరా నరసింహారెడ్డి లాంటి పాన్ ఇండియా చిత్రంలో నటించినా కొద్ది సేపు కనిపించే పాత్రలోనే అలరించారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రభాస్ మూవీ ఆద్యంతం కనిపించనున్నారన్న వార్త ఆసక్తిని పెంచుతోంది.