బాలీవుడ్ చిన్నది.. భలే స్టార్టప్ ప్లాన్ చేసిందే!

0

సినిమాల్లో బాగా క్లిక్ అయిన నటీనటులు ఒక చేత్తో బాగా సంపాదిస్తున్నా.. మరో చేత్తో కూడా సంపాదించేందుకు భలే ప్లాన్లు వేస్తుంటారు. కొందరు సినిమాల్లో నటిస్తూనే యాడ్స్ చేస్తుంటారు. మరి కొందరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. మిగతావారికన్నా సినీ నటులకు వ్యాపార నిర్వహించడం మరింత సులువు. ఎందుకంటే వాళ్లకు ఉన్న క్రేజ్ కారణంగా వారు తయారుచేసిన ఉత్పత్తులకు పెద్దగా ప్రచారం అవసరం ఉండదు. ఎందుకంటే వారి బ్రాండ్లకు వాళ్లే బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతారు.

సినీ నటుల వ్యాపారాలపై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఉంటుంది కాబట్టి.. ఈ రంగంలో వారు విజయం సాధించడం సులువుగానే ఉంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘ బీయింగ్ హ్యూమన్’ పేరుతో పలు ఉత్పత్తులను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో రానా మహేష్ బాబు రకుల్ ప్రీత్ సింగ్ తరుణ్ మంచు విష్ణు మనోజ్ రామ్ చరణ్ సమంత నాగ చైతన్య పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టారు.

ఇక హీరో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ చిన్నపిల్లల దుస్తుల వ్యాపారం ప్రారంభించారు. ఇందులో పెట్టుబడులకు కూడా ఆమె ఆహ్వానం పలుకుతోంది. తాను ప్రారంభించిన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. అలియాభట్ ‘ఎడ్ ఏ మమ్మా’ పేరుతో చిన్నపిల్లల దుస్తుల వ్యాపారం నిర్వహిస్తోంది. విజయ్ దేవరకొండ లాగా దుస్తుల వ్యాపారంలో క్లిక్ అయ్యేందుకు ఆమె ఫోకస్ పెట్టింది.