Templates by BIGtheme NET
Home >> Cinema News >> బిబి4 విన్నర్ లీక్ అవ్వకుండా లైవ్

బిబి4 విన్నర్ లీక్ అవ్వకుండా లైవ్


తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ పూణెలో జరగడంతో లీక్ లు అనేవి లేకుండా జరిగింది. కాని సీజన్ 2 నుండి ప్రతి వారం ఎలిమినేషన్ ముందు రోజే లీక్ అవ్వడం మొదలైంది. ఈ సీజన్ అయితే ఏకంగా వీక్ డేస్ టాస్క్ లు మరియు విన్నర్ లు.. కెప్టెన్ ఎవరు కాబోతున్నారు ఇలా అన్న విషయాలు లీక్ అవుతున్నాయి. టీం కావాలని లీక్ చేశారా లేదంటే జరిగిపోయిందా అనేది పక్కన పెడితే విన్నర్ విషయంలో మాత్రం లీక్ అస్సలు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. బిగ్ బాస్ విన్నర్ ను లైవ్ ద్వారా ప్రకటించాలని నిర్ణయించారు.

షో కు సంబంధించిన డాన్స్ లు ఇతర కార్యక్రమాలు ఉదయం నుండే షూట్ చేస్తారు. కాని కార్యక్రమం చివరి ఘట్టం అయిన విన్నర్ ను ప్రకటించడం ట్రోఫీ ఇవ్వడం మొత్తం కూడా లైవ్ లోనే నిర్వహించబోతున్నారట. కనీసం ఒకటి రెండు నిమిషాలు కూడా ముందు ఎవరికి తెలియకుండా టీం జాగ్రత్త పడుతున్నారు. ఎంత జాగ్రత్త పడ్డా కూడా విజేత అభిజిత్ అనే విషయం అందరికి తెలుసు అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప అందరు షాక్ అవ్వరు. విజేతను ఈసారి చిరంజీవి అనౌన్స్ చేస్తారని.. నాగార్జున ట్రోఫీ అందిస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని గంటల్లో బిబి 4 విన్నర్ ఎవరు అనేది తేలిపోనుంది.