వైరల్ అవుతున్న ‘బిగ్ బాస్-14’ షో కంటెస్టెంట్ల లిస్ట్.. ఈసారి హీరోయిన్ కూడా..!!

0

కరోనా మహమ్మారి కారణంగా గత నాలుగు నెలలుగా అవే వార్తలు వినాల్సి వస్తుంది. రోజురోజుకి వేల సంఖ్యలో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుండి ఇళ్లలో ఉంటున్న జనాలు టీవీ ప్రోగ్రాంలతో కాలక్షేపం చేస్తున్నారు. అందులోను ప్రేక్షకులను బాగా అలరించే వాటిలో ఒకటి బిగ్ బాస్. ఈ షోలో టీవీ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది. అందుకే తెలుగు తమిళ కన్నడ హిందీ బాషలలో బిగ్ బాస్ అంత హిట్ అయింది. బిగ్ బాస్ ద్వారా ఆర్టిస్టులు అందులో సభ్యుల టాలెంట్స్ వారి లైఫ్ స్టైల్ వారి ఆలోచన విధానం ఇలా అన్నీ తెలిసిపోతాయి. మంచిగా అనిపించిన వారిని ప్రేక్షకులు ఓటేసి మరి ఎన్నుకుంటారు. ఇక తెలుగులో మూడు సీసన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో.. హిందీలో పదమూడు సీసన్లు పూర్తి చేసుకొని పద్నాలుగో సీసన్ వైపు పరుగు పెడుతుంది. త్వరలోనే హిందీ బిగ్ బాస్ షో ప్రారంభం కానుందట.

ప్రస్తుత కరోనాలో అసలు ఈ షో ఉంటుందో ఉండదో అనుకునే సమయంలో ఓ ప్రోమో వదిలి హైప్ క్రియేట్ చేశారు బిగ్ బాస్ యాజమాన్యం. ఈసారి కూడా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా ఆయన పై ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో ప్రోమో షూట్ చేశారు. ఈ కొత్త ప్రోమో ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారట. సెప్టెంబర్లో మొదలు కానున్న ఈ షోలో ఈసారి ఎవరెవరు పాల్గొంటారనే విషయం పై భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈసారి కూడా టీవీ నటుల మీదే ఫోకస్ పెట్టారట. ఆ జాబితా ప్రకారం.. వివియాన్ సేన సంగీతా ఘోష్ అలీషా పన్వార్ జై సోని షాగున్ పాండే విశాల్ రహేజా డోనాల్ బిష్త్ షలీన్ భనోత్ షిరాన్ మిర్జా నియా శర్మ జాస్మిన్ భాసిన్ ఉన్నట్లు సమాచారం. అలాగే తెలుగు హీరోయిన్ “ఉల్లాసంగా ఉత్సాహంగా” ఫేమ్ స్నేహా ఉల్లాల్ కూడా బిగ్బాస్లో పాల్గొంటున్నట్లు టాక్. అయితే ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరనేది షో ప్రారంభం వరకు తెలియదని అంటున్నారు. చూడాలి ఇక ఈ సీసన్ 14 ఎలా ఉండబోతుందో..!