ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ క్రేజీ అప్డేట్…!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అనౌన్స్ చేసారు తారక్. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషనల్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఇప్పటికే ఎన్టీఆర్ కి స్టోరీ కూడా వినిపించారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

కాగా ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవల్లో నిర్మించనున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోనున్న తారక్.. ప్రశాంత్ నీల్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా రూపొందించనున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఎన్టీఆర్ తెలుగుతో పాటు తమిళ హిందీ వర్షన్స్ కి కూడా స్వయంగా డబ్బింగ్ చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని డబ్బింగ్ చిత్రంగా కాకుండా.. డైరెక్ట్ గా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా షూట్ చేయాలని అనుకుంటున్నారట. అందుకోసం ఈ సినిమాకి బల్క్ డేట్స్ కేటాయించమని ఎన్టీఆర్ ని కోరుతున్నారట.

ఇదిలా ఉండగా తారక్ – ప్రశాంత్ నీల్ కాంబో ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఎందుకంటే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మిగతా షూటింగ్ కంప్లీటై.. ఎన్టీఆర్ ఈ మూవీ నుండి బయటికి రావడానికి చాలా సమయం పడుతుంది. వెంటనే త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు తారక్. ఇక ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి.. సినిమా రిలీజ్ చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుంది. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి చాలా సమయమే పట్టేట్టు ఉందని చెప్పవచ్చు. మరో వైపు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ 2’ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరి ‘కేజీఎఫ్ 2’ తర్వాత మరో ప్రాజెక్ట్ చేస్తాడా లేదా ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తాడా అనేది చూడాలి.